Minister Anurag Thakur: తుక్డే తుక్డే గ్యాంగ్‌తో కలిసి భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. తుక్డే తుక్డే గ్యాంగ్ తో కలిసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని విమర్శించారు. జెఎన్‌యులో భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నించిన వారికి రాహుల్ అండగా నిలిచారని, ఇప్పుడు వీర్ సావర్కర్‌ను ప్రశ్నిస్తున్నారని..
కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం (నవంబర్ 18, 2022) గుజరాత్ మోడల్ పాలనను ప్రశంసించారు. దేశంలోనే ఇది నంబర్ 1 మోడల్ అని, అభివృద్ధికి నమూనా అని ఆయన అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, నిజాయితీ ప్రాతిపదికన తన పార్టీ పనిచేస్తుందన్నారు. మరోవైపు కులం, వర్గాలు, మతం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడుగుతున్నారని మంత్రి విమర్శించారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తుక్డే తుక్డే గ్యాంగ్‌తో ప్రయాణిస్తున్నాడని.. హిందూ టెర్రర్ గురించి మాట్లాడిన ఆయన, జేఎన్‌యూలో భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నించిన వ్యక్తులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. జేఎన్‌యూలో భారత్‌ను విభజించేందుకు ప్రయత్నించిన వారికి అండగా నిలిచి.. ఇప్పుడు వీర్ సావర్కర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ మనస్తత్వం.. చెప్పుకోడానికి ఒక్క కుటుంబానికి మించి వారి వద్ద ఏమీ కనిపించదన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
అభివృద్ధిలో నంబర్‌వన్ మోడల్..
అభివృద్ధిలో గుజరాత్ నంబర్ వన్ మోడల్‌గా అభివర్ణించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. గుజరాత్ మోడల్ నంబర్ వన్ అని, అభివృద్ధి నమూనా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజించి పాలించే రాజకీయాలు మాత్రమే చేస్తుందన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే..
गुजरात में क्यों चाहिए फिर भाजपा की सरकार?
क्योंकि…जब गुजरात आगे बढ़ता है, तब हिंदुस्तान आगे बढ़ता है।#ભાજપના_ભવ્ય_વિજયનો_શંખનાદ#ભરોસાની_ભાજપ_સરકાર
| @BJP4India @BJP4Gujarat | pic.twitter.com/rmAyGC22eB
— Anurag Thakur (@ianuragthakur) November 18, 2022
కులం, వర్గం, మతం ప్రాతిపదికన కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అయితే మరోవైపు బీజేపీ సుపరిపాలన, అభివృద్ధి, నిజాయితీ ప్రాతిపదికన పనిచేస్తుంది.
60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని ప్రధాని మోదీ 8 ఏళ్లలో చేశారు
అయితే, సుపరిపాలన అభివృద్ధి, పేద సంక్షేమం, నిజాయితీని బిజెపి నమ్ముతుంది. ఇదీ బీజేపీ గుర్తింపు.. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే రెట్టింపు డాక్టర్లు తయారయ్యారని అన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ 8 ఏళ్లలో చేసిందే కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేకపోయింది. దీంతో పాటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర దేశాన్ని, ఇక్కడ రాష్ట్రాన్ని సీఎం భూపేంద్ర నడుపుతున్నారని అన్నారు. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం