Chamoli Accident: చమోలిలో ఘోర ప్రమాదం.. 600 మీటర్ల లోతైన లోయలో పడిన బొలెరో.. మహిళలు సహా 12మంది మృతి..

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అద్దాలు పగిలిపోయాయి. చక్రాలు విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సమాచారం ప్రకారం వాహనం కిమన గ్రామం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Chamoli Accident: చమోలిలో ఘోర ప్రమాదం.. 600 మీటర్ల లోతైన లోయలో పడిన బొలెరో.. మహిళలు సహా 12మంది మృతి..
Chamoli Accident
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2022 | 8:12 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోషిమత్ బ్లాక్‌లోని ఉర్గాం-పల్లా జఖోలా మోటార్‌వేపై బొలెరో మ్యాక్స్ వాహనం  ప్రమాదానికి గురైంది. వాహనం 600 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యల కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది మృతి చెందారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మీడియా కథనాల ప్రకారం,.. బొలెరో మ్యాక్స్ వెహికల్ UK (076453) వాహనంలో దాదాపు డ్రైవర్ సహా 16 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. SDRF రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. చీకటిలో లోయలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.ప్రమాదంలో మరణించిన ఇద్దరు మహిళలు, 10 మంది పురుషుల మృతదేహాలను బృందం వెలికి తీసింది.  మొత్తం 12మంది ప్రయాణీకుల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది రెస్క్యూ టీమ్‌ బృందం.. కందకంలో పడిన వాహనం లోపల, చుట్టు పక్కల సోదాలు కొనసాగిస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న రహదారి జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర దోబాల్‌తో సహా SDRF, NDRF, పోలీసులు, పరిపాలన అధికారుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అద్దాలు పగిలిపోయాయి. చక్రాలు విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సమాచారం ప్రకారం వాహనం కిమన గ్రామం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఆ వాహనంలో చుట్టుపక్కల ఊరి జనం వెళుతున్నారు. ఈ రహదారి ఇంకా నిర్మాణంలో ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌