Desi Jugaad: రేకు డబ్బా, కర్రతో దేశీ గిటార్ సృష్టి.. తమ్ముడూ నీ ప్రతిభ అమోఘం అంటున్న నెటిజన్లు..
రైళ్లలో లేదా దారిలో ప్రయాణంలో, ప్రతిభతో నిండిన అనేక మందిని వ్యక్తులను తరచుగా మనం చూస్తూ ఉంటాం. అయితే డబ్బు లేకపోవడం, పేదవారన్న చిన్న చూపు.. లేదా ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల ఇలాంటి అనేక మంది ప్రతిభ మరుగున పడిపోతుంది. అయితే కొంతమంది వ్యక్తులకు చెందిన వీడియోలు సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసి..
జుగాడ్ లు తయారు చేయడంలో భారతీయుల ప్రతిభకు కొలమానం లేదు. దేశంలో ఒకటి కంటే ఎక్కువ మంది జుగాడ్ లను తయారు చేసి.. ప్రజల మన్నలను పొందుతున్నారు. అంతేకాదు ‘ దేశీ జుగాడ్ ‘ లతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు కూడా.. ప్రస్తుతం, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. అందులో ఒక వ్యక్తి జుగాడ్ తో సంగీత వాయిద్యాన్ని తయారు చేశాడు. ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరి హృదయం పాటల తోటలో విహరిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భారీగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఒక్క జుగాడ్ తో ఇందులోని వ్యక్తి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చాలా సార్లు.. రైళ్లలో లేదా దారిలో ప్రయాణంలో, ప్రతిభతో నిండిన అనేక మందిని వ్యక్తులను తరచుగా మనం చూస్తూ ఉంటాం. అయితే డబ్బు లేకపోవడం, పేదవారన్న చిన్న చూపు.. లేదా ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల ఇలాంటి అనేక మంది ప్రతిభ మరుగున పడిపోతుంది. అయితే కొంతమంది వ్యక్తులకు చెందిన వీడియోలు సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసి.. తద్వారా సదరు వ్యక్తుల్లో దాగున్న ప్రతిభను కొంతమంది ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలో.. జుగాడ్‌తో తయారు చేసిన గిటార్ లాంటి వాయిద్యంతో ఒక వ్యక్తి ‘మేరే రష్కే కమర్’ పాటను ప్లే చేస్తున్నాడు. అతను పాటకు, ప్రతిభకు ప్రజలు మంత్రముగ్దులయ్యారు.
దేశీ జుగాడ్ వీడియోను ఇక్కడ చూడండి:
వైరల్ అయిన క్లిప్‌లో, వ్యక్తి జుగాడు వాయిద్యంపై ట్యూన్ ప్లే చేస్తున్న తీరు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. dn_bundeli_damoh_studio పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. 2 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. జుగాడు వాయిద్యం వాయించే వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు.. ప్రతిభ వీధుల్లో అద్భుతాన్ని సృష్టిస్తుంది.. రాజభవనాలలో అదృష్టం ప్రస్థానం చేస్తుంది. అదే సమయంలో, మరొకరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. ఈ సోదరుడికి అవకాశం ఇవ్వాలని సూచించాడు. మరొకరు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. పేదవాడు కావడం వల్ల ప్రతిభ దొడ్డుమీద నడుస్తోందన్నారు. మొత్తంమీద, యువకుడి ప్రతిభపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..