PM Narendra Modi: అరాచక శక్తులను అంతం చేయాల్సిందే.. ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదులు దాడులకు పాల్పడక ముందే అరాచక శక్తులను అంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
No Money for Terror Meet: ఉగ్రవాదులు దాడులకు పాల్పడక ముందే అరాచక శక్తులను అంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు మద్దతిస్తూ, నిధులను అందచేస్తున్నాయని పాకిస్తాన్, చైనాను ఉద్దేశించి ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల విదేశీవిధానంలో భాగంగా టెర్రరిస్టులకు నిధులు అందుతున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదంపై ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మోదీ (PM Narendra Modi) ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై కఠినఆంక్షలు విధించాలన్నారు. ప్రతి ఉగ్రదాడికి అదేరీతిలో సమాధానం ఉండాలి.. కొన్ని సందర్భాల్లో కొంతమంది పరోక్షంగా ఉగ్రవాదులకు మద్దతుగా వాదనలు విన్పిస్తున్నారు. టెర్రరిస్టులపై చర్యలను వీళ్లు అడ్డుకుంటున్నారంటూ మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడక ముందే.. అరాచక శక్తులను అంతం చేయాల్సిందేనని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించాల్సిందేనంటూ మరోసారి పునరుద్ఘాటించారు. NMFT సమావేశంలో ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. మన పౌరులు సురక్షితంగా ఉండాలని కోరుకుంటే, ఉగ్రవాదం మన ఇళ్లలోకి వచ్చే వరకు వేచి ఉండలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై పశ్చిమ దేశాలు దృష్టి సారించాయని.. ఐకమత్యంతో రూపుమాపాల్సిందేనని పేర్కొన్నారు.
భారత్‌లో ఉగ్రవాదాన్ని చాలావరకు అదుపు చేశాం.. అమిత్ షా
భారత్‌లో ఉగ్రవాదాన్ని చాలావరకు అదుపు చేశామని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఆరు అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఉగ్రవాదాన్ని అదుపు చేసినట్టు చెప్పారు. కఠినచట్టాలు, ఉగ్రవాదుల ఆర్ధికమూలాలను ధ్వంసం చేయడం, ఇంటెలిజెన్స్‌ను పటిష్టం చేయడం, ఇరుగు-పొరుగు దేశాలతో సమాచారమార్పిడితో ఇది సాధ్యమయ్యిందన్నారు.
‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సుకు 72 దేశాలు, 15 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. పలు దేశాల మంత్రులతో పాటు 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉగ్రవాదులకు నిధుల నిరోధంపై ఇది మూడో సదస్సుది. అంతకుముందు 2018 ఏప్రిల్‌లో పారిస్ వేదికగా.. 2019 నవంబరులో మెల్‌బోర్న్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.
Addressing the ‘No Money for Terror’ Ministerial Conference on Counter-Terrorism Financing. https://t.co/M7EhOCYIxS
— Narendra Modi (@narendramodi) November 18, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..