Green Pea Benefits: పచ్చి బఠానీలా మజాకా..! చలికాలంలో రోజూ తింటే నమ్మలేనన్ని ప్రయోజనాలు..

శీతాకాలంలో పలు రకాల పండ్లు, కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. ఔషధ గుణాలు, పోషకాలు కలిగిన వీటిని రెగ్యులర్‌గా తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ముఖ్యంగా ఈ సీజన్‌లో పచ్చి బఠానీలు మార్కెట్లో పుష్కలంగా లభిస్తాయి.

Green Pea Benefits: పచ్చి బఠానీలా మజాకా..! చలికాలంలో రోజూ తింటే నమ్మలేనన్ని ప్రయోజనాలు..
Green Peas
Follow us

|

Updated on: Nov 17, 2022 | 9:20 AM

Green Pea Health Benefits:  శీతాకాలంలో పలు రకాల పండ్లు, కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. ఔషధ గుణాలు, పోషకాలు కలిగిన వీటిని రెగ్యులర్‌గా తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ముఖ్యంగా ఈ సీజన్‌లో పచ్చి బఠానీలు మార్కెట్లో పుష్కలంగా లభిస్తాయి. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పచ్చి బఠానీల్లో ప్రొటీన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం ఉంటాయి. వీటిని అన్నంలో, లేదా కూరగా చేసుకొని తినవచ్చు. అదే సమయంలో, పచ్చి బఠానీలు తినడం ద్వారా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే రోజూ మటర్ తినాలని సూచిస్తున్నారు. పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బఠానీలలో మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పచ్చి బఠానీలు రోజూ తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం: బఠానీలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వీటిని రెగ్యులర్‌గా వినియోగించడం ద్వారా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. పచ్చి బఠానీల్లో సెలీనియం మూలకం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్‌, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మధుమేహం : పచ్చి బఠానీలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి బఠానీలను రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఎందుకంటే పచ్చి బఠానీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.

జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది: పచ్చి బఠానీలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉదరానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్.. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు పచ్చి బఠానీలను రోజూ తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్