AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Health: రుచిలోనే కాదు పోషకాల్లోనూ సూపర్ ఫుడ్.. ఇలా జ్యూస్ చేసుకుని తాగితే సమస్యలన్నీ పరార్..

చలికాలంలో విరివిగా లభించే ఉసిరి రుచే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఉసిరి ని ఏ రూపంలో తీసుకున్నా అందులోని..

Amla Health: రుచిలోనే కాదు పోషకాల్లోనూ సూపర్ ఫుడ్.. ఇలా జ్యూస్ చేసుకుని తాగితే సమస్యలన్నీ పరార్..
Amla
Ganesh Mudavath
|

Updated on: Nov 17, 2022 | 8:23 AM

Share

చలికాలంలో విరివిగా లభించే ఉసిరి రుచే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఉసిరి ని ఏ రూపంలో తీసుకున్నా అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. జ్యూస్‌ చేసుకుని తాగినా, ఓరుగులు చేసుకున్నా, మురబ్బా, రోటి పచ్చడి, ఊరగాయ.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలూ అందిస్తాయి. సీ విటమిన్ అధికంగా ఉండే ఉసిరిని సూపర్‌ ఫుడ్‌ అని కూడా పిలవచ్చు. ఆయుర్వేద కాలం నుంచి ఉసిరి వినియోగం అధికంగా ఉంది. ఉసిరిని డైట్‌లో చేర్చుకుని తినడం వల్ల ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు ఉన్నాయి. దీనిలో ఫైబర్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ – సీ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, బీ–కాంప్లెక్స్‌తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉన్నాయి. అందుకే ఉసిరిని రోజు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి.

షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి ఔషధంగా పనిచేస్తుంది.క్రోమియం షుగర్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా అయ్యేలా చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారికి ఉసిరి చక్కని పరిష్కారం చూపిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి వేయడాన్ని నివారిస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా కంట్రోల్ లో ఉంటారు. జీర్ణ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి ఉసిరి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఉసిరిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. కొంతమంది ఉసిరి కాయను పచ్చిగా తింటారు, మరికొందరు ఉసిరి ని ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకుంటారు. పచ్చడిని కూడా చేసుకుని తీసుకోవచ్చు ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉసిరిని తీసుకోవచ్చు.

ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉండే ఉసిరి జ్యూస్‌ తయారు చేయడానికి రెండు కాయలను తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వడగట్టుకుని గ్లాస్ లో పోసుకోవాలి. అవసరం అనుకున్న వారు ఇందులో కాస్త తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..