Back Pain: యువకుల్లో పెరుగుతున్న వెన్నునొప్పి సమస్యలు.. ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి

వెన్నునొప్పి అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువకులకు శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా వారి శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది.

Back Pain: యువకుల్లో పెరుగుతున్న వెన్నునొప్పి సమస్యలు.. ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి
Back Pain
Follow us

|

Updated on: Nov 17, 2022 | 8:40 AM

గతంలో ఎముకలు అరిగిపోవడానికి తోడు వృద్ధాప్యం వల్ల వెన్నునొప్పి వచ్చేది. కానీ ఇటీవలి కాలంలో వయస్సు, వ్యాధులు ఒకదానికొకటి సంబంధం ఉండడం లేదు. కాలేజీకి వెళ్లే విద్యార్థుల నుంచి ఆఫీసుకు వెళ్లే యువకుల వరకు వెన్నునొప్పి రావడం సాధారణమైపోయింది.ఉదయం నిద్ర లేవగానే నొప్పులు రావడం, ఆఫీసులో 8-9 గంటలపాటు కూర్చొని పనిచేయడం వల్ల వెన్నునొప్పి సమస్య పెరుగుతోంది. వ్యాయామం లేకపోవడం కూడా దీనికి ఓ కారణం. వెన్నునొప్పి అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువకులకు శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా వారి శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. కొంతమంది ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తూ రోజంతా ఇంట్లోనే కూర్చుంటారు. కొంతమంది యువకులు కుర్చీపై సరైన స్థితిలో కూర్చుని చదువుకోవడం లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం లేదు. పడుకుని పని చేయడం, పుస్తకం వంగి చదవడం, పడుకుని టీవీ చూడటం వంటివి కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు. ఇక శీతకాలంలో కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా వెన్నునొప్పి సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా వింటర్‌లో అల్లం టీ వెన్నునొప్పి బాధితులకు మంచి డ్రింక్‌. దీనిని తరచూ తాగడం వల్ల వెన్నునొప్పితో పాటు జలుబు, దగ్గు, జలుబు కూడా నయమవుతాయి.

వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడానికి మీరు పసుపు పాలను కూడా తాగవచ్చు. తద్వారా వెన్నునొప్పి క్రమంగా తగ్గుతుంది. పైగా ఇందులోని పోషకాలు కండరాలను బలపరుస్తాయి. అలాగే పసుపు పాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచి మార్గం. వెన్నునొప్పి విషయంలో, మీరు యోగాసనాలు, కొన్ని వ్యాయామాలను కూడా ఆశ్రయించవచ్చు, అయితే, ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించకుండా మాత్రం వీటిని చేయకండి. అలాగే మన వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి పని నుంచి అప్పుడప్పుడు కొద్ది పాటి విరామం తీసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే భంగిమలో ఒకే చోట కూర్చోకూడదు. కనీసం రెండు గంటలకొకసారైనా లేచి అటూ ఇటూ తిరగాలి. లేకపోతే వెన్నునొప్పి తీవ్రమవుతుంది. ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి వీలయినంత వరకు వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఖాళీ సమయంలో మెడ, వీపు, భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. ఇక ఆహారం విషయంలో అధిక కొవ్వు పదార్ధాలను దూరం పెట్టండి. అలాగే తగినంత నీరు తాగండి. తక్కువ కొవ్వు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవసరమైన ఖనిజాలు మీ బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే వెన్నెముకపై ఉండే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి