Frog: అచ్చం మనుషుల్లాగే.. నీటిలో తలకిందులుగా ఆసనాలు వేస్తోన్న కప్ప.. షాకింగ్ వీడియో
చాలా మంది వ్యక్తులు ఈత కొట్టడంలో చాలా నిష్ణాతులు. నీళ్లలో తలకిందులుగా కూడా సులభంగా ఈత కొట్టగలరు. ఆసనాలు వేయగలరు. కొన్ని చేపలు కూడా ఇలా చేస్తాయని తెలుసు.
ఈత ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈత కొట్టడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు . అంతే కాకుండా స్విమ్మింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈత తెలియకపోతే, నేర్చుకోవడం మంచిది. ఇది కష్ట సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది వ్యక్తులు ఈత కొట్టడంలో చాలా నిష్ణాతులు. నీళ్లలో తలకిందులుగా కూడా సులభంగా ఈత కొట్టగలరు. ఆసనాలు వేయగలరు. కొన్ని చేపలు కూడా ఇలా చేస్తాయని తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా కప్ప అదే విధంగా ఈత కొట్టడం చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక కప్ప నీటిలో తలక్రిందులుగా ఎలా పడుకుండడం, అదే విధంగా ఈత కొట్టడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. తనకేమీ కంగారు లేదన్నట్టు ఆనందంతో ఈ కప్ప ఈదుతున్నట్లు తెలుస్తోంది. ఆ నీటిలో ఇంకా చాలా కప్పలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఒకే చోట నీటిలో ఉండిపోగా కొన్ని మాత్రం ఈత కొడుతున్నాయి. అయితే ఈ వెరైటీ కప్ప మాత్రం మనుషుల్లా తలకిందులుగా ఈత కొడుతోంది.
ఈ ఫన్నీ వీడియో @ndagels అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 17 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అలాగే వేలమందికి పైగా ఈ వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నమైన రియాక్షన్లు ఇస్తున్నారు. కప్ప స్విమ్మింగ్ కొట్టడం చూసి ఫన్నీ ఎమోజీలు, కామెంట్లు పెడుతున్నారు.
Chill pic.twitter.com/9YTAdxRwY3
— Mas Adem (@ndagels) November 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..