Viral: వామ్మో! మహిళ కడుపులో ఏకంగా 4 అడుగుల పాము.. బయటికి తీసిన డాక్టర్ల గుండె గుభేల్..

అప్పుడప్పుడూ వైద్యులు షాకయ్యే ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. పలు సమస్యలతో వెళ్లిన కొందరికి.. పరీక్షలు చేయగా..

Viral: వామ్మో! మహిళ కడుపులో ఏకంగా 4 అడుగుల పాము.. బయటికి తీసిన డాక్టర్ల గుండె గుభేల్..
Snake Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2022 | 9:38 AM

అప్పుడప్పుడూ వైద్యులు షాకయ్యే ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. పలు సమస్యలతో వెళ్లిన కొందరికి.. పరీక్షలు చేయగా.. చివరికి రిపోర్టులు చూసి డాక్టర్లే షాకవుతుంటారు. ఇలాంటి తరహా ఓ ఘటన తాజాగా రష్యాలో వెలుగు చూసింది. ఇంతకీ అదేంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఆ వీడియో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..?

రష్యాకు చెందిన ఓ మహిళ ఇటీవల గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చింది. అంతలోనే స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందో ఏంటోనని కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి దెబ్బకు షాకయ్యారు. ఆమె కడుపులో సుమారు 4 అడుగుల పాము ఉండటాన్ని గుర్తించారు. చివరికి అతికష్టం మీద ఆమె నోటి ద్వారా దాన్ని బయటికి తీశారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బయటికి తీసిన తర్వాత కూడా ఆ పాము బ్రతికి ఉండటాన్ని చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియోను చూసి భయపడగా.. ఇంకొందరు ఇదెలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోయారు. మరి మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.