Viral Video: ఆ గున్న ఏనుగుకి అతను తెగ నచ్చేశాడట.. కింద పడేసి మరీ తెగ ముద్దులు పెట్టేసింది..

పిల్లలు చూడటానికి ముద్దుగా ఉంటారు. అందుకే పిల్లలకు చాలా మంది ముద్దులు పెడుతుంటారు. అయితే, ఒకటో రెండో ముద్దులతో సరిపెడతారు. అదే పిల్లలకు పెద్దలు ముద్దొస్తే..

Viral Video: ఆ గున్న ఏనుగుకి అతను తెగ నచ్చేశాడట.. కింద పడేసి మరీ తెగ ముద్దులు పెట్టేసింది..
Elephant
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 16, 2022 | 9:00 PM

పిల్లలు చూడటానికి ముద్దుగా ఉంటారు. అందుకే పిల్లలకు చాలా మంది ముద్దులు పెడుతుంటారు. అయితే, ఒకటో రెండో ముద్దులతో సరిపెడతారు. అదే పిల్లలకు పెద్దలు ముద్దొస్తే.. ముఖమంతా ముద్దులతో రచ్చ చేస్తారు. అయితే, మనుషులకు మాత్రమే కాదు.. జంతువుల పిల్లలకూ వర్తిస్తుందండోయ్. అవును, ఏనుగు పిల్లకు ఓ వ్యక్తి విపరీతంగా నచ్చాడు. ఇంకేముందు.. అతను ముఖం అందకపోయేసరికి, అతన్ని కింద పడేసి మరీ ముద్దుల వర్షం కురిపించింది. అతను దానిని వదిలించుకోవాలని ఎంత ట్రై చేసినా వదిలితే ఒట్టు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

ఓ వ్యక్తి ఏనుగుల సంరక్షణ శాలకు వెళ్లాడు. అక్కడ ఉన్న షెడ్డులో ఓ పెద్ద ఏనుగుతో పాటు పిల్ల ఏనుగు కూడా ఉంది. దానిని చూసి అతను ముచ్చటపడ్డాడు. తల నిమురుతూ దానికి ప్రేమను పంచాడు. అయితే, ఆ గున్న ఏనుగు అతని చూపిన ప్రేమకు ఫిదా అయిపోయింది. అతను తెగ నచ్చేయడంతో తన చిన్న తొండంతో అతన్ని చుట్టేసింది. ముఖం అంతా నిమురుతూ ముద్దులు పెట్టింది. చిన్నగా మొదలైన ఈ ముద్దుల పర్వం.. మరింత ఘాటుగా మారింది. అతన్ని కింద పడేసి మరీ ముఖంపై ముద్దుల వర్షం కురిపించింది గున్న ఏనుగు. దానిని పక్కకు నెట్టేందుకు అతను ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. మళ్లీ మళ్లీ మీదకు వచ్చి రచ్చ చేసింది. చివరకు ఎలాగోలా దాని ప్రేమ బందీ నుంచి బయటపడ్డాడు అతను. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కొన్ని సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల మందికిపైగా వీక్షించారు. అదే సమయంలో 16,000 మంది కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. మరెందుకు ఆలస్యం ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..