Groom - Bride: పెళ్లి వేదికపై వుధువుకు వరుడి వింత కండిషన్‌..  నవ్వులు పూయిస్తున్న వీడియో.

Groom – Bride: పెళ్లి వేదికపై వుధువుకు వరుడి వింత కండిషన్‌.. నవ్వులు పూయిస్తున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 16, 2022 | 8:57 PM

మండపంలో వధూవరులకు వేద మంత్రోచ్ఛారణతో వివాహం జరిపిస్తున్నారు వేద పండితుడు. బంధుమిత్రులంతా ఆనందంగా వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వివాహ సమయంలో


మండపంలో వధూవరులకు వేద మంత్రోచ్ఛారణతో వివాహం జరిపిస్తున్నారు వేద పండితుడు. బంధుమిత్రులంతా ఆనందంగా వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వివాహ సమయంలో చదివే మంత్రాలకు, చేసే ప్రమాణాలకు అర్ధం వివరిస్తున్నారు పంతులుగారు. ఈ నేపధ్యంలో వధువుకు తాను ఇకపై పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి తీసుకొని వెళ్లాలని పంతులుగారు చెప్పారు. ఈ మాట విన్న వరుడు వెంటనే స్పందించాడు. తన భార్యను పుట్టింటికి పంపించడానికి ఓ వింత కండిషన్‌ పెట్టాడు. ఆ కండిషన్‌ విన్న అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వేసారు. ఇంతకీ వధువుకి వరుడు పెట్టిన కండిషన్‌ ఏంటంటే.. ”నువ్వు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళు.. నేను అసలు వద్దు అనను.. అయితే నేను ఒక షరత్తు మీద నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాను.. ఒకటి రెండు రోజుల కోసం కాదు.. నువ్వు పుట్టింటికి వెళ్తే.. నెల రోజులు ఉండాలి.. అంతకంటే తక్కువ అయితే పుట్టింటి వెళ్లొద్దు అని సరదాగా అన్నాడు.. దీంతో వివాహ వేదిక నవ్వుల వేదికగా మారింది.ఈ ఫన్నీ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. చాలా మంది వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ వివాహంలో మాత్రమే ఇలాంటి సన్నివేశాలను చూడగలరని ఒకరంటే.., ‘వధువు ముఖం కోపంతో ఎర్రగా మారినట్లు కనిపిస్తుంది’ అని మరొరు.., ‘ పెళ్లి అయి కాపురం మొదలు పెట్టండి.. ఎవరి అనుమతి ఎవరు తీసుకోవాలో అప్పుడు తెలుస్తుంది’ అంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 16, 2022 08:57 PM