Watch Video: కదులుతున్న కోడిని వడ్డించిన రెస్టారెంట్‌ నిర్వాహకులు.. గ్రిల్‌ చికెన్‌ తినాలనుకున్నవారి గుండె గుబేల్..

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోలకు లెక్కే లేదు. నిత్యం రకరకాల వీడియోలు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఇలాంటి వైరల్‌ అయ్యే వీడియోల్లో ప్రాంక్‌ వీడియోల జాబితా మొదటి వరుసలో ఉంటుంది. సాధారణంగా..

Watch Video: కదులుతున్న కోడిని వడ్డించిన రెస్టారెంట్‌ నిర్వాహకులు.. గ్రిల్‌ చికెన్‌ తినాలనుకున్నవారి గుండె గుబేల్..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2022 | 8:06 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోలకు లెక్కే లేదు. నిత్యం రకరకాల వీడియోలు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఇలాంటి వైరల్‌  వీడియోల్లో ప్రాంక్‌ వీడియోల జాబితా మొదటి వరుసలో ఉంటుంది. సాధారణంగా రోడ్లపై వెళ్లే వారిని టీజింగ్‌ చేస్తూ ప్రాంక్‌ వీడియోలను రూపొందిస్తుంటారు. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ప్రాంక్‌ వీడియోలకు బాప్‌లా ఉంది.

ఇంతకీ విషయమేంటంటే.. ఓ రెస్టారెంట్‌లో గ్రిల్‌ చికెన్‌ తినడానికి కస్టమర్లు ఆర్డర్‌ ఇచ్చి టేబుల్‌పై కూర్చున్నారు. అదే సమయంలో హోటల్‌ నిర్వహకులు గ్రిల్‌ చికెన్‌ను ఓ ప్లేట్‌లో తీసుకొచ్చి వడ్డించారు. తీరా కస్టమర్లు చికెన్‌ను లాగించేందామని ఫోక్‌తో సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా ఆ చికెన్‌ కదలడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా వారి గుండే గుబేల్‌ మంది.

ఇవి కూడా చదవండి

వేడి వేడిగా వండించిన కోడి కదలడంతో ఉలిక్కిపడ్డారు. అయితే ఇదంతా రెస్టారెంట్‌ నిర్వాహకుల పనే. అచ్చంగా గ్రిల్‌ చికెన్‌ను పోలినట్లుగా దాన్ని రూపొందించి దానిని రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేశారు. దీనంతటినీ దూరంగా ఉన్న కెమెరాలో రికార్డ్‌ చేశారు. రెస్టారంట్‌ వచ్చిన కస్టమర్ల రియాక్షన్స్‌ను కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నిజానికి ఈ వీడియో ఎప్పుడో చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. కానీ తాజాగా మళ్లీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..