పుణ్యం పేరిట వింత ఆచారం.. ఎంగిలాకులపై భక్తుల పోర్లుదండాలు.. ఎక్కడంటే..!

పొర్లు దండలు పెడుతున్న భక్తులు ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారు కూడా ఇక్కడ ఎంగిలాకులపై పోర్లు దండాలు పెడుతుంటారు. 

పుణ్యం పేరిట వింత ఆచారం.. ఎంగిలాకులపై భక్తుల పోర్లుదండాలు.. ఎక్కడంటే..!
Champashashti
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 16, 2022 | 6:02 PM

కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి గుడిలో ఈ యేడు చంపా షష్టి ఏడేస్నాన సేవకు అనుమతి లభించింది. కరోనా సమయంలో ఈ వేడుకపై ఆంక్షలు విధించారు. నవంబర్ 21 నుంచి కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య నియోజకవర్గంలో చంపాషష్టి జాతర మహోత్సవం జరగనుంది. చంపాషష్టి జాతర మహోత్సవం నిర్వహించేందుకు పాలకమండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష దీపోత్సవం రోజున రాత్రి రథోత్సవ మాడవీధుల్లో ఊరేగింపు సేవ చేసేవారిని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇంతకీ ఈ కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం ఎక్కడుంది..? చంపాషష్టి అంటే ఏమిటో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఏడేస్నానం అంటే ఎంగిలాకుల మీద పొర్లు దండాలు పెడతారు భక్తులు. ఇలా చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులైన ఇట్టే మాయమవుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. వింటేనే అసహ్యం పుట్టించే ఈ వింత ఆచారం ఎక్కడిదో ? ఎలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

కర్నాటక లోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో ప్రతీయేటా ఈ వింత ఉత్సవం జరుగుతుంది. కుక్కే సుబ్రమణ్య దేవాలయం మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊర్లో కలదు. సుబ్రమణ్య స్వామిని ఇక్కడ నాగ దేవత గా ఆరాధించడం విశేషం. సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు రాష్ట్ర నలుమూలాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సర్పదోష పూజలతో పాటు.. ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు. దీంతో పాటుగా ఏడేస్నానాలు అనే వింత ఆచారం కూడా అమలు చేస్తారు. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఏడేస్నానాల ఉత్సవం జరుపుతారు.

అయితే, గతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలను నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం, ఆలయ అధికారులు. ఈ యేడు కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేయటం, వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఏడేస్నానాలకు అనుమతించారు. చంపా షష్టి ఉత్సవాల సందర్బంగా ఈసారి మూడు రోజులపాటు భక్తులకు స్నానాలకు అవకాశం కల్పించారు. చౌతి, పంచమి, షష్ఠి నాడు ఈడెస్నానం చేస్తారు ప్రజలు. అంటే నవంబర్‌ 27, 28, 29 తేదీల్లో ఇక్కడ స్నానాలకు అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం మహాపూజ అనంతరం భక్తులు తమ ఇష్టానుసారంగా ఈడెస్నానలో పాల్గొనవచ్చు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఆగమ శాస్త్ర పండితుల సమక్షంలో ఈడెస్నానాలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

అసలు విషయానికి వస్తే.. ఇక్కడ ఆలయ ప్రాంగణం చుట్టూ ఆకులు వేసి అక్కడ నైవేద్యాలు పెడతారు. ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. ఊర్లోని దళితులు, గిరిజనులు వచ్చి ఆ ఆకుల పై పొర్లు దండాలు పెడతారు. ఇలా చేస్తే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పొర్లు దండలు పెడుతున్న భక్తులు ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారు కూడా ఇక్కడ ఎంగిలాకులపై పోర్లు దండాలు పెడుతుంటారు.  మధ్యతరగతి కుటుంబీకులు, టీచర్లు, ఇంజనీర్లు, వైద్యులు, న్యాయవాదులు ఇలా ఎందరో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అయితే, ఈ వింత ఆచారంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు లో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి