ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న వరదలు.. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సాయం కోరుతూ..

ఊహించిన దానికంటే వరద వేగంగా పెరగడంతో 2గంటల్లోనే స్థానికులు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న వరదలు.. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సాయం కోరుతూ..
Australia Floods
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 16, 2022 | 5:19 PM

మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం అంతర్జాతీయ సహాయాన్ని కోరాయి. ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో  వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఫ్లాష్‌ ఫ్లడ్స్‌. రెండ్రోజుల నుంచి పడుతున్న కుండపోత వానలతో వందలాది ఇళ్లు నీటమునిగిపోయాయి. దీంతో ఇళ్ల పైకప్పులు, చెట్లపైకెక్కి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గడుపుతున్నారు స్థానికులు.

వరదలు ముంచెత్తడంతో ప్రభుత్వం సహాయకచర్యలు చేపట్టింది. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా వందలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. పలు ప్రాంతాలను ముంచెత్తింది.

సదరన్‌ టేబుల్‌ ల్యాండ్స్‌లోని ట్యూనాలో 165మి.మీ, ఫోర్బ్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో 127మి.మీ, విక్టోరియా, మౌంట్‌ హోథమ్‌లో 144మి.మీ, టాలండూన్‌లో 133మిల్లీమీట్లర్ల వర్షపాతం నమోదైంది. యూగోరాలో సడెన్‌గా నీటిమట్టం పెరిగింది. ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. బతికి ఉండటం తమ అదృష్టమంటున్నారు స్థానికులు.

ఫోర్బ్స్‌లో 1952 తర్వాత..అంటే 70ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. లాచ్లాన్‌ నది ఉప్పొంగుతోంది. ఊహించిన దానికంటే వరద వేగంగా పెరగడంతో 2గంటల్లోనే స్థానికులు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. న్యూ సౌత్ వేల్స్ చరిత్రలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన ప్రభుత్వం..అదనంగా సిబ్బందిని మోహరించింది. ఇక ముర్రం బిడ్జీ నదిని వరదలు ముంచెత్తాయి. రికార్డు స్థాయికి చేరుకుంది నీటిమట్టం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి