PM Modi on G20 Presidency: ప్రపంచానికి ఈ కూటమి ఓ దిక్సూచిలా పనిచేయాలి.. జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ..

జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ నుంచి భారత ప్రధాని మోదీ బాధ్యతలను స్వీకరించారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.

PM Modi on G20 Presidency: ప్రపంచానికి ఈ కూటమి ఓ దిక్సూచిలా పనిచేయాలి.. జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ..
PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 16, 2022 | 6:20 PM

బుధవారం (నవంబర్ 16) ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G-20 శిఖరాగ్ర సమావేశంలో G-20 శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశానికి అప్పగించారు. ఇది గర్వకారణమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జి-20 సదస్సులో బుధవారం రెండో రోజు పలు దేశాల మధ్య కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐదు దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశం కొనసాగిస్తోంది భారత్. వీరిలో ఇటలీ, ఆతిథ్య ఇండోనేషియా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు ఉన్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీ జీ20 దేశాల నేతలతో కలిసి బాలిలోని మడ అడవులను సందర్శించారు. ప్రధాని మోదీ ప్రసంగం గురించి 10 అతి ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం..

  1. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ నుంచి భారత ప్రధాని మోదీ బాధ్యతలను స్వీకరించారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ప్రపంచానికి ఈ కూటమి ఓ దిక్సూచిలా పనిచేస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి సభ్యదేశాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయన్నారు.
  2. వచ్చే ఏడాది జీ-20 సమావేశాలు భారత్‌లో జరుగుతాయి. ఇది యుద్దాలకు సమయం కాదని ఉక్రెయిన్‌ వార్‌పై స్పందించారు మోదీ. రానున్న ఏడాది కాలంలో జీ-20 సభ్య దేశాలు ప్రపంచశాంతి కోసం కలిసికట్టుగా కృషి చేస్తాయన్నారు మోదీ. భూతపాన్ని తగ్గించడం.. పుడమితల్లిని కాపాడడం అందరి బాధ్యత అన్నార. అభివృద్ది ఫలాలు అన్ని దేశాలకు సమానంగా అందినప్పుడే ప్రపంచశాంతి సాధ్యమవుతుందని అన్నారు
  3. జీ-20 సమావేశాల సందర్భంగా పలువురు దేశాధినేతలతో మోదీ భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో మోదీ కీలక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ సంక్షోభంతో పాటు ప్రపంచ ఆర్ధికసంక్షోభం ..తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. జీ-20 సమావేశాల కంటే ముందే భారత్‌-ఫ్రాన్స్‌ దేశాల మధ్య అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.
  4. బాలిలో జీ-20 దేశాధినేతలతో కలిసి మోదీ మడ అడవులను సందర్శించారు. మొక్కలను నాటారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ , బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ , ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ , ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలిలో ఉన్న మడ అడవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అరుదైన ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు జీ-20 నేతలు .
  5. ప్రధాని మోదీతో సమావేశం తరువాత బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.
  6. జీ-20 సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం కన్పించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ భారత ప్రధాని మోదీకి సెల్యూట్‌ చేశారు. మోదీ ఆయనకు ప్రతి నమస్కారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. శాంతికోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను బైడెన్‌ అభినందించారు. భారత అధ్యక్షతన జీ-20 కూటమి మరింత బలోపేతం అవుతుందన్నారు.
  7. ఓవైపు జీ-20 సమావేశాలు జరుగుతున్న సమయం లోనే పోలండ్‌లో క్షిపణి దాడి తీవ్ర కలకలం రేపింది. తొలుత ఇది రష్యా అని అందరూ భావించారు. పోలండ్‌లో క్షిపణిదాడిలో ఇద్దరు చనిపోవడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఉక్రెయిన్‌ బలగాల రష్యా మిస్సైల్‌ను కూల్చేయడంతో ఈ పేలుడు జరిగినట్టు తరువాత వెల్లడయ్యింది .
  8. జీ-20 సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ల మధ్య జరగాల్సిన భేటీ రద్దయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం జిన్‌పింగ్‌ , రిషి సునాక్‌ల మధ్య భేటీ జరగాల్సి ఉంది. కాని అనివార్య కారణాలతో ఈ సమావేశం రద్దయ్యింది. చైనా తీరును రిషి సునాక్‌ తప్పుపట్టిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.
  9. జీ-20 సదస్సు ముగింపు సందర్భంగా కూటమి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ యుద్దంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. యుద్దంలో అణ్వాయుధాలను ప్రయోగిస్తే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. రష్యా -ఉక్రెయిన్‌ చర్చల తోనే సమస్యను పరిష్కరించుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు.
  10. కొత్త ఆలోచనలు, భావనలు, సామూహిక కార్యాచరణను వేగవంతం చేయడానికి G-20 గ్లోబల్ ప్రైమ్ మూవర్‌గా పనిచేయడం మా ప్రయత్నం అని ప్రధాని మోదీ అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని జీ-20 సదస్సులో ప్రధాని మోదీ అన్నారు. మా జి-20 ఎజెండాలో మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మనం ప్రాధాన్యతనివ్వాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం