Britain Visa: వారి కలయికతో యువతకు కలిసి వచ్చే ప్రకటన.. కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం

భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలయిక.. మన దేశస్థులకు, భారత సంతతివారికి చాలా..

Britain Visa: వారి కలయికతో యువతకు కలిసి వచ్చే ప్రకటన.. కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం
Modi And Sunak
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 17, 2022 | 2:35 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలయిక.. మన దేశస్థులకు, భారత సంతతివారికి చాలా సంతోషకరమైనదిగా మారింది. అయితే వారి కలయిక మరికొన్ని పరిణామాలకు దారితీసింది. అది నిజంగా మన దేశంలోని యువకులకు సంతోషకరమైన విషయం. ఏమిటంటే.. ఇరు దేశాల ప్రధానులు కలిసిన కొన్ని గంటలకే భారత యువ నిపుణులకు ప్రతి ఏటా 3,000 వీసాలను అందించే విధంగా బ్రిటన్ ప్రభుత్వం అమోదించింది. బ్రిటన్ ప్రధాని అధికార కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి విడుదల అయిన ప్రకటన ప్రకారం.. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల భారతీయ గ్రాడ్యుమేట్లకు వృత్తి, సాంస్కృతిక మార్పులలో పాలు పంచుకునేందుకు జీవితకాలంలో ఒకసారి అవకాశం లభిస్తుంది. ఇది 2023 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి వీసా సదుపాయం పొందిన మొదటి దేశం మనదే కావడంతో మరింత విశిష్టతను సంతరించుకుంది.

ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలయిక జరిగిన కొన్ని గంటల సమయంలోనే ఈ ప్రకటన విడుదలయింది. గత నెలలో సునాక్ బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే వారి మొదటి సమావేశం. కలయిక గురించి “బాలీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రులు మోదీ, సునాక్ సంభాషించుకుంటున్నారు’’ అని భారత ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. సునాక్ కూడా ఓ ప్రకటనలో “మన భద్రత, మన శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్ సత్సంబంధాలు చాలా కీలకమైనదవి. భారతదేశంతో మనకున్న లోతైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాల విలువ నాకు ప్రత్యక్షంగా తెలుసు. భారతదేశం ప్రకాశవంతమైన యువకులలో, ఇంకా ఎక్కువ మంది బ్రిటన్‌లో అవకాశాన్ని పొందగలరని నేను సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.

కాగా, బ్రిటన్ వలస జనాభాలో భారతీయ మూలాలున్న వారు అధిక భాగం, అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ దేశానికి చెందినవారే. బ్రిటన్ ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. ఒక వేళ అవి సఫలమయితే..ఒక యూరోపియన్ దేశంతో భారత్ చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..