ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఎవరో తెలుసా.. నెల సంపాదన తెలిస్తే మైండ్ బ్లాంక్..
ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల వినియోగం భారీగా పెరిగింది. అందులోనూ యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త కంటెంట్‌తో చాలా మంది యూట్యూబ్ ద్వారా స్టార్స్ కూడా అవుతున్నారు. ఆదాయ..
ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల వినియోగం భారీగా పెరిగింది. అందులోనూ యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త కంటెంట్‌తో చాలా మంది యూట్యూబ్ ద్వారా స్టార్స్ కూడా అవుతున్నారు. ఆదాయ మార్గంగా కూడా చాలా మంది దీనిని ఎంచుకుంటున్నారు. కాని యూట్యూబ్ ఛానెల్ పెట్టి క్లిక్ అవడం అంత తేలికైన పనికాదు. ప్రారంభంలో మంచి ఉత్సహంతో స్టార్ట్ చేసి ఆ తర్వాత సబ్ స్క్రిప్షన్ లేకపోవడంతో మూతపడిన యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. కాని సరైన కంటెంట్‌తో ప్రజలను ఆకట్టుకుంటున్న యూబ్యూబర్లు మాత్రం తెగ పాపులర్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్‌గా నిలిచాడు అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్ అయితే జిమ్మీ డొనాల్డ్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు.. కాని మిస్టర్ బీట్స్ అంటే మాత్రం చాలా మందికి గుర్తొస్తాడు ఈ యూట్యూబర్. మిస్టర్ బీట్స్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్ ప్రస్తుతం దాదాపు 112 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ అంటే 11 కోట్లకు పైగా సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉన్నాడు. గత కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో రారాజుగా వెలుగొందుతున్న స్వీడన్‌కి చెందిన చెందిన ఫెలిక్స్ అర్వింద్ ఉల్ఫ్ జెల్‌బర్గ్‌ని మిస్టర్ బీట్స్ వెనక్కి నెట్టాడు. ప్యూ డై పైగా పేరుగాంచిన ఫెలిక్స్‌కు యూట్యూబ్‌లో 111.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. బీస్ట్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ల సంఖ్య ఈమధ్యే 111.9 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది జూలైలో వంద మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ని సాధించిన రెండో యూట్యూబర్‌గా జిమ్మీ గుర్తింపు సాధించాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న స్క్విడ్ గేమ్స్ సిరీస్‌ని రిక్రియేట్ చేయడంతో జిమ్మీ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అతడి యూట్యూబ్ ఛానెల్‌ని చాలామంది సబ్‌స్క్రైబర్స్ చేసుకున్నారు. అంతేకాదు 2021లో అత్యధిక ఆదాయం సంపాదించిన యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను యూట్యూబ్‌లో వీడియోలు చేయడమే కాకుండా అమెరికాలో మిస్టర్ బీస్ట్ బర్గర్ అనే రెస్టారెంట్‌ని కూడా నడిపిస్తున్నాడు. అమెరికాలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూటూబ్ ఛానెల్‌లో మనదేశానికి చెందిన టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్ ప్రథమ స్థానంలో ఉంది. టీ సిరీస్‌ని 229 మిలియన్ల మంది అంటే 20 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
ప్రపంచంలో ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. అతడి సంపాదన కూడా ఎక్కువే. యూట్యూబ్ ద్వారా నెలకు 3మిలియన్ డాలర్లు అంటే 30 లక్షల యూట్యూబ్ డాలర్లు సంపాదిస్తాడని ఓ సంస్థ వెల్లడించింది. యూట్యూబర్ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు నెలలో సంపాదిస్తున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..