Pakistan Cricket: ఉగ్రదాడి ఫలితంగా క్రికెట్ మైదానాలు వివాహ వేదికలుగా మారాయని అంటున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్..
పాకిస్థాన్‌కు వెళ్లి క్రికెట్ ఆడాలంటే ఇతర దేశాల ఆటగాళ్లు వెనకడుగు వేశారు. అందుకు కారణం లేకపోలేదు. 2009 లో సిరీస్ కోసం ఆ దేశానికి వెళ్లిన శ్రీలంక జట్టు మీద..
అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ టీమ్ 2022లో చాలా మెరుగ్గా ఆడుతోంది. యువ ఆటగాడు బాబార్ అజామ్ నేతృత్ంలో ఆ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అసియా కప్, ఈ నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ రన్నరప్‌గా నిలిచింది. అయితే 2021,2022 సంవత్సరాలకు ముందు ఆ దేశానికి వెళ్లి క్రికెట్ ఆడాలంటే ఇతర దేశాల ఆటగాళ్లు వెనకడుగు వేశారు. అందుకు కారణం లేకపోలేదు. 2009 లో సిరీస్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన శ్రీలంక జట్టు మీద ఉగ్రవాద దాడి జరగింది. పాకిస్థాన్ రాజధాని లాహోర్‌లోనే ఉగ్రదాడి జరగడంతో.. భద్రతా కారణాల రీత్యా ఇతర దేశాల టీమ్‌లు ఆ దేశంలో పర్యటించడం మానేశాయి. ఆ ఘటన జరిగిన 12 సంవత్సరాల తర్వాత, 2021 లో మొదటిసారిగా ఇంగ్లాండు టీమ్ ఆ దేశంలో పర్యటించింది. తర్వాత ఈ ఏడాది ఏప్రీయల్ నెలలో అస్ట్రేలియా జట్టు కూడా ఆ దేశానికి వచ్చి ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. విదేశీ క్రికెట్ టీమ్‌లు నెమ్మదిగా తమ దేశానికి క్రికెట్ పర్యటనకు రావడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. 2009 ఘటన తర్వాత పాకిస్థాన్‌తో సిరీస్‌లు ఆడేందుకు ఇతర దేశాలు తమ దేశానికి రావడం ఆపేశాయని.. ఫలితంగా దేశంలోని క్రికెట్ మైదానాలను వివాహ వేదికలుగా మార్చేశారని తెలిపాడు. ‘‘ మా దేశంలోని క్రికెట్ మైదానాలన్నీ వివాహ వేదికలుగా మారిపోయాయి.
మా మైదానాలలో క్రికెట్ ఆడాలని మా అందరికీ ఉండేది. అడుతున్న సమయంలో ప్రేక్షకులు లేక మా మైదానాలన్ని వెలవెలపోయేవి. దాని నుంచి అధిగమించడానికి మా క్రికెట్ బోర్డ్, మా దేశ ప్రభుత్వం ఎంతగానో కృషి చేశాయి. గడ్డు కాలం అంతా ముగిసిపోయింది. పరిస్థితులు కూడా మారిపోయాయి. చాలా కాలం తర్వాత మా దేశానికి విదేశీ పర్యటకులు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఆ క్రమంలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్లు వచ్చాయి. ఫలితంగా మా దేశం కూడా క్రీడలను ప్రేమించే దేశమే అని ప్రపంచానికి తెలిసింది’’ అని షాహిద్ అఫ్రిదీ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండు చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయి, టోర్నీ రన్నరప్‌గా నిలిచింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘బెన్ స్ట్రోక్స్, సామ్ కర్రన్ జట్టును గెలిపించుకోవడంలో ప్రధాన పాత్రను పోషించారు. ఫలితంగానే పాక్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండు గెలవగలిగింది. దీంతో వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ రెండూ ఆ జట్టు వద్దకే చేరినట్లయింది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండు జట్టు.. దాదాపు 80 వేల మంది ప్రేక్షకుల మధ్య కప్‌ను గెలుచుకుంది’’ అని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..