IND vs NZ: ఆ సిరీస్ ప్రసార హక్కులు మావే.. ప్రకటించిన డీడీ..

ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఐఐసీ టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఓడిపోయిన భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు శుక్రవారం నుంచి టీ20 సిరీస్‌లో ప్రత్యక్షంగా తలపడనున్నాయి.

IND vs NZ: ఆ సిరీస్ ప్రసార హక్కులు మావే.. ప్రకటించిన డీడీ..
Dd News
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 17, 2022 | 10:10 AM

ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఐఐసీ టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఓడిపోయిన భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు శుక్రవారం నుంచి టీ20 సిరీస్‌లో ప్రత్యక్షంగా తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది. ప్రపంచ కప్ సెమీఫైనల్ నుంచే నిష్క్రమించిన ఈ ఇరు జట్లు ఎలాగైనా ప్రస్తుతం జరగబోయే టీ20 సిరీస్‌ను దక్కించుకుని, కొంత ఊరటను పొందాలని అనుకుంటున్నాయి. అయితే రెండు దేశాలు మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు సంబంధించిన ప్రసార హక్కులను డీడీ స్పోర్ట్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని డీడీ స్పోర్ట్స్ స్వయంగా బుధవారం సాయంత్రం తన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. కాగా, ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడి రెండు సిరీస్‌లను గెలుచుకుంది. ఆ సిరీస్‌లను కూడా డీడీ స్పోర్ట్స్ భారత్‌లో ప్రసారం చేయగా.. వెస్టిండీస్‌లో ఫ్యాన్‌కోడ్ ప్రసారం చేసింది. అయితే డిజిటల్ హక్కులు మాత్రం అమెజాన్ ప్రైమ్‌కు రిజర్వ్ అయ్యాయి..

న్యూజిలాండ్‌లో భారత్‌ పర్యటన

భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా..ఆ రెండు జట్లు శుక్రవారం(నవంబర్ 18) తలపడనున్నాయి. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో నిరాశకు గురయిన ఇరు జట్లు ఎలాగైనా ఈ సిరీస్ కప్‌ను సాధించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలను న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది.

ఇవి కూడా చదవండి

టీ20 షెడ్యుల్:

వెల్లింగ్టన్ (నవంబర్ 18), టావ్‌రాంగ (నవంబర్ 20), నాపియెర్ (నవంబర్ 22)

వన్డే షెడ్యుల్:

అక్లాండ్ (నవంబర్ 25), హామిల్టన్ (నవంబర్ 27), క్రీస్ట్ చర్చ్ (నవంబర్30)

స్క్వాడ్స్:

న్యూజిలాండ్ టీ20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే , జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ , ఇష్ సోధి , టిమ్ సౌథీ , టిమ్ సౌతీ

న్యూజిలాండ్ వన్డే జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ

భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ ), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్‌దీప్ యాదవ్ , హర్షల్ పటేల్, మొహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ , ఉమ్రాన్ మాలిక్

భారత వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ ), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ , అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..