Amazon India: ఆ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థను టార్గెట్ చేసుకున్న హిందూ సంస్థ..? తెలుసుకుందాం రాండి..

అంతర్జాతీయ సంస్థ, దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ గురించి తెలియనివారు ఉండరు. అయితే ఇప్పుడు ఆ దిగ్గజ కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. అమెరికాకు చెందిన ఓ మిషనరీ..

Amazon India: ఆ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థను టార్గెట్ చేసుకున్న హిందూ సంస్థ..? తెలుసుకుందాం రాండి..
The Organiser Magazine Cove
Follow us

|

Updated on: Nov 16, 2022 | 9:03 AM

అంతర్జాతీయ సంస్థ, దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ గురించి తెలియనివారు ఉండరు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలోనో, ఇష్టమైన చిత్రాలను చూడడానికో అమెజాన్ సేవలను అందరూ ఏదో ఒక సందర్భంలోనైనా పొందే ఉంటారు. అయితే ఇప్పుడు ఆ దిగ్గజ కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. అమెరికాకు చెందిన ఓ మిషనరీ సంస్థ నుంచి నిధులు సమకూర్చుకుంటూ భారత దేశంలో మత మార్పిడులకు పాల్పడుతోందని ప్రముఖ హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) తన మాగ్‌జెన్ ద్వారా ఆరోపిపంచింది. ఈ మేరకు తన కవర్ స్టోరీని కూడా ప్రచురించింది ఆ మ్యాగ్‌జెన్. ఈ ఆరోపణలను ఖండించిన అమెజాన్.. మత మార్పిడి సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము లాభాపేక్ష లేకుండా భారత్‌లో పనిచేస్తు్న్నామని తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగజైన్ ‘ది ఆర్గనైజర్’ తన ఇటీవలి ప్రచురణలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మత మార్పిడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ కవర్ స్టోరీని పబ్లిష్ చేసింది.‘‘అమేజింగ్ క్రాస్ కనెక్షన్’’ శీర్షికతో ఉన్న కవర్ స్టోరీలో, ‘అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్(ఏబీఎమ్)’ అనే అమెరికాకు చెందిన సంస్థతో కంపెనీకి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, ఈశాన్య రాష్ట్రాలలో మత మార్పిడి కోసం సహకరిస్తున్నట్లు పేర్కొంది.

దేశంలో ఆల్ ఇండియా మిషన్ (ఏఐఎమ్) పేరుతో ఏబీఎమ్ ఒక ఫ్రంట్ నడుపుతోందని కూడా ది ఆర్గనైజనర్ తన ప్రచురణలో ఆరోపించింది.‘‘ఈశాన్య భారతదేశంలో 25 వేల మందిని క్రైస్తవ మతంలోకి మార్చినట్లు తమ వెబ్‌సైట్‌లో బహిరంగంగా పేర్కొన్న వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇద’’ అని మ్యాగ్‌జెన్ వెల్లడించింది. తనపై ఆర్ఎస్ఎస్ మ్యాగ్‌జెన్ చేసిన ఈ ఆరోపణలను అమెజాన్ ఖండించింది. ‘‘అమెజాన్ ఇండియాకు ఆల్ ఇండియా మిషన్ లేదా దాని అనుబంధ సంస్థలతో ఏ విధమైన సంబంధం లేదు. అమెజాన్ ఇండియా మార్కెట్‌ ప్లేస్‌లో అమెజాన్ స్మైల్ ప్రోగ్రామ్ పనిచేయదు. అది ఎక్కడ పనిచేస్తుందో కూడా మాకు తెలియదు’’ అని అమెజాన్‌లో పనిచేసే ఓ అధికారి తెలిపారు.

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్‌సిపిసిఆర్) చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ “మేము ఈ విషయాన్ని ముందుగానే గమనించి, సెప్టెంబర్‌లో అమెజాన్‌కు నోటీసులు పంపించాము. కానీ అమెజాన్ స్పందించలేదు. తర్వాత నేను అక్టోబర్‌లో అమెజాన్‌కి సమన్లు​జారీ చేసాను. ఇంకా నవంబర్ 1న కమిషన్ కార్యాలయంలో అమెజాన్ ఇండియాలో పనిచేసే ముగ్గురు అధికారులను కలిశాను”అని చెప్పారు. ‘‘అమెజాన్ ఇండియా, ఆల్ ఇండియా మిషన్ మధ్య ఎటువంటి ఆర్థిక సంబంధం లేదని..అమెజాన్ ఇండియా నుంచి ఆ సంస్థకు డబ్బు వెళ్లదని అమెజాన్ ప్రతినిధులు మాకు చెప్పారు. అమెజాన్ సంస్థ అమెరికా ఆల్ ఇండియా మిషన్‌కు కొంత డబ్బు ఇచ్చిందని అమెజాన్ ఇండియా తెలిపింది. విదేశాల్లో ఉన్నట్లుగా ఉన్న ఆల్ ఇండియా మిషన్‌ చిరునామా మాకు ఇచ్చారు. మేము ఇప్పుడు ఆల్ ఇండియా మిషన్‌ను మరింత దర్యాప్తు చేస్తాము”అని కానూంగో చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగ్‌జైన్ అమెజాన్‌పై ఆరోపణలు చేయడం ఇది మొదటి సారి అయితే కాదు. రిటైల్ మార్కెట్‌ను కంపెనీ కూడా వారు గతంలో ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబరు 2021లో “పాంచజన్య”లో అమెజాన్‌ను ఈస్టిండియా కంపెనీతో పోల్చుతూ ఒక కవర్ స్టోరీని ప్రచురించింది. అందులో అమెజాన్ క్రైస్తవ సంస్థలకు నిధులు సమకూర్చడంలో సహకరిస్తుందని ఆరోపించింది. డిసెంబర్ 2021లో, స్వదేశీ జాగరణ్ మంచ్.. భారతదేశంలో అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలకు మంజూరు చేసిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది . ఈ సంస్థలు అందించే డిస్కౌంట్ కారణంగా ఇతర సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోందిని మంచ్ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో