AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Laundering: ఆ కేసులో కీలక పరిణామం.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా జాక్వెలిన్..

ఎట్టకేలకు ఆమెకు బెయిల్‌ వచ్చింది. ఐతే కండిషన్స్‌ అప్లై అంటోంది కోర్ట్‌. అవును, మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు

Money Laundering: ఆ కేసులో కీలక పరిణామం.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా జాక్వెలిన్..
Jacqueline Fernandez
Shiva Prajapati
|

Updated on: Nov 16, 2022 | 8:28 AM

Share

ఎట్టకేలకు ఆమెకు బెయిల్‌ వచ్చింది. ఐతే కండిషన్స్‌ అప్లై అంటోంది కోర్ట్‌. అవును, మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది జాక్వెలిన్‌. సుఖేష్‌ ఆమెకు చాలా ఖరీదైన బహుమతులు అందించినట్టు.. అలాగే సుఖేష్‌తో జాక్వెలిన్‌ చాలా సన్నిహితంగా ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెను కూడా నిందితురాలిగా చార్జ్‌షీట్‌లో చేర్చింది ఈడీ. ఈ కేసులో ఆమె మధ్యంతర బెయిల్‌ గడువు ముగియడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ED..ఆమె దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని, ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. కేవలం సరదా కోసమే 7కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని వెల్లడించిన ఈడీ..ఆమె బెయిల్‌ను వ్యతిరేకించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం..ఇప్పటి వరకు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. నటిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసినప్పటికీ, దర్యాప్తు సమయంలో ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది.

మరోవైపు ఇప్పటికే ద‌ర్యాప్తు ముగియ‌డంతో పాటు ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసినందున జాక్వెలిన్‌ను క‌స్టడీలో ఉంచాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టుకు తెలిపారు జాక్వెలిన్‌ తరపు న్యాయవాదులు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్ట్‌..జాక్వెలిన్‌కు 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..