Kiwi Health Benefits: శీతాకాలంలో ‘కివి’ తింటే అద్దిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

పోషకాల గని ‘కివి’. ఈ కివి పండ్లు ఎక్కువగా న్యూజిలాండ్‌లో సాగవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కివి ని సాగు చేస్తున్నారు. అయితే, కివి లో ఉండే పోషకాలు..

Kiwi Health Benefits: శీతాకాలంలో ‘కివి’ తింటే అద్దిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Kiwi Fruit
Follow us

|

Updated on: Nov 15, 2022 | 2:10 PM

పోషకాల గని ‘కివి’. ఈ కివి పండ్లు ఎక్కువగా న్యూజిలాండ్‌లో సాగవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కివి ని సాగు చేస్తున్నారు. అయితే, కివి లో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, కాపర్, విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాటిలో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కివీ తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే, శీతాకాలంలో కివి పండ్లను తినడం వల్ల డుబుల్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివి ని రోజూ ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో కివి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గిస్తుంది..

కివి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శీతాకాలంలో వచ్చే అనేక వ్యాధులను నివారిస్తుంది. రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

కివిలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని ప్రోటీన్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న రోగులకు ఇది గొప్పం వరం. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి..

నారింజ, నిమ్మకాయలతో మాత్రమే విటమిన్ సి అధికంగా ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కివి పండ్లలో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఇది నిమ్మకాయ, నారింజ కంటే రెండింతలు అధికం. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు.. అన్ని రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఇది చర్మంతో పాటు.. జుట్టుకు కూడా మేలు చేస్తుంది.

మంచి నిద్ర..

కివి పండ్లలో సెరోటోనిస్ ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది.

క్యాన్సర్‌ను నిరోధిస్తుంది..

కివి పండ్లలో ఉండే ఫైబర్, ఫైటోకెమికల్స్.. శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. కడుపు, ప్రేగులు, పెద్ద పేగు క్యాన్సర్‌ను నివారించడంలో అద్భుత పాత్ర పోషిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్