AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఆహారాలను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే మంచిది కాదు.. జాగ్రత్త!

Health Tips: ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఉరుకులు పరుగుల..

Health Tips: ఈ ఆహారాలను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే మంచిది కాదు.. జాగ్రత్త!
Eat Food
Subhash Goud
|

Updated on: Nov 15, 2022 | 11:14 AM

Share

Health Tips: ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించాలంటే పోషకాలున్న ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అయితే కొన్ని ఆహారాలు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ఉదయం కొన్నింటిని తీసుకుంటే రాత్రి సమయాల్లో కొన్నింటిని తీసుకోవాలి. అలాగే కొన్ని ఆహారాలకు రాత్రుల్లో దూరంగా ఉండటం మంచిది. మరికొన్ని ఆహారాలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. మన ఆరోగ్యానికి పనికొచ్చే కొన్ని టిప్స్‌ గురించి వైద్యులు వివరిస్తున్నారు. అందులో కొన్నింటిని మీకు తెలియజేస్తున్నాము.

రాత్రి సమయంలో తినకూడని ఆహారాలు: బిర్యానీ, మసాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బిర్యానీ వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉండాలి. చికెన్, మటన్ బిర్యానీలను అస్సలు తినకూడదు. ఇది ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో కొవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అందుకే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అంతేకాదు రాత్రి సమయంలో వీటిని తినడం వల్ల సరిగ్గా జీర్ణం కావు.

బంగాళ దుంపలు: బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని రాత్రుళ్లు తీసుకోకూడదు. శరీరానికి కావాల్సిన శక్తిని తక్కువ సమయంలో అందించే గుణం కలిగిన బంగాళదుంపలను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి
  1. అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది.
  2. ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. వీటిని రాత్రిళ్లు తీసుకోకుండా చూడాలి.
  3. వెంటనే శక్తిని అందించే గుణం బంగాళాదుంపల్లో ఉంటుంది. అందుకని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది.
  4. మొలకెత్తిన విత్తనాలు, గింజలను ఎప్పుడు తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
  5. ఉదయం పూట నిద్రలేవగానే మొలకెత్తిన గింజలు, విత్తనాలు తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి.
  6. ఆపిల్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. పాలతో కలిపి తీసుకోకుండా చూసుకోవాలి.
  7. రాత్రి వేళ వరి అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం మంచిది.
  8. పెరుగును కేవలం పగటి వేళనే తీసుకోవాలి. రాత్రి సమయంలో పెరుగు త్వరగా జీర్ణం కాదు. అందుకే రాత్రి సమయంలో తినకపోవడం మంచిది.
  9. మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకని మధ్యాహ్నమే తినాలి.
  10. పాలు జీర్ణమయ్యేందుకు ఎక్కువ టైం అవసరం. అందుకని రాత్రి వేళ తీసుకోవడం ఉత్తమం.
  11. వరి అన్నం రాత్రి పూట తినకూడదు. మధ్యాహ్నం మాత్రమే తినేలా చూసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి