AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Health: డయాబెటిక్ బాధితులకు ఈ గింజలు అద్భుత వరం.. షుగర్ ను కంట్రోల్ చేయడమే కాకుండా..

మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ కామన్ సమస్యగా అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. రక్తంలో చక్కెర లెవెల్స్ ను పెంచేస్తోంది. ఇది తీవ్రంగా..

Diabetic Health: డయాబెటిక్ బాధితులకు ఈ గింజలు అద్భుత వరం.. షుగర్ ను కంట్రోల్ చేయడమే కాకుండా..
Diabetic
Ganesh Mudavath
|

Updated on: Nov 15, 2022 | 9:52 AM

Share

మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ కామన్ సమస్యగా అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. రక్తంలో చక్కెర లెవెల్స్ ను పెంచేస్తోంది. ఇది తీవ్రంగా మారి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తున్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలి, తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఫుడ్ తో పాటు సరైన వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండవచ్చు. డయాబెటిస్‌ను నివారించాలనుకునేవారు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ గా తీసుకునే ఆహారంతో పాటు కొన్ని గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మెంతులు.. మెంతి గింజలలో ఉండే డైటరీ ఫైబర్ ను గెలాక్టోమన్నన్ అని పిలుస్తారు. ఇది గ్లూకోజ్ జీర్ణక్రియ, శోషణను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర లెవెల్స్ తగ్గుతాయి. దీంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అంతే కాకుండా గ్లూకోజ్ టాలరెన్స్ మెరుగుపడుతుంది.

వాము.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఫైబర్ కంటెంట్ కారణంగా వాము గింజలు షుగర్ బాధితులకు అద్భుతమైన మందుగా చెప్పవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తాయి.

ఇవి కూడా చదవండి

సబ్జా గింజలు.. తులసి గింజల్లో పీచు అధికంగా ఉంటుంది. డయాబెటీస్ బాధితులు సాధారణంగా తులసి గింజలను భోజనం చేసే ముందు తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి.

గుమ్మడికాయ గింజలు.. ట్రైగోనెలైన్, నికోటినిక్ యాసిడ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండే గుమ్మడికాయ గింజలు మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఒమేగా -6 కొవ్వులు, మెగ్నీషియం డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.

అవిసె గింజలు.. అవిసె గింజల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అవిసె గింజలు టైప్ 1, టైప్ 2 మధుమేహం రెండింటి ప్రాబల్యాన్ని తగ్గిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..