AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: సులభంగా, వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? రోజూ ఈ కార్బ్ ఆహారాలను తీసుకోండి..

ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు డైట్లను అనుసరించడంతోపాటు.. జిమ్‌లలో చెమటోడ్చుతున్నారు.

Weight Loss Tips: సులభంగా, వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? రోజూ ఈ కార్బ్ ఆహారాలను తీసుకోండి..
Weight Loss
Shaik Madar Saheb
|

Updated on: Nov 15, 2022 | 6:44 AM

Share

ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు డైట్లను అనుసరించడంతోపాటు.. జిమ్‌లలో చెమటోడ్చుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. అయితే, బరువు తగ్గే ప్రక్రియలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి, ఒక వ్యక్తి ప్రతిరోజూ ప్రోటీన్, ఫైబర్ మొత్తాన్ని తీసుకోవాలి. అదే సమయంలో, బరువు తగ్గడానికి తక్కువ కార్బ్, అధిక ఫైబర్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తక్కువ కార్బ్ కారణంగా, ఆహారంలో కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలంటే పోషకాలు పుష్కలంగా, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. ఎలాంటివి తింటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ఈ తక్కువ కార్బ్ ఆహారాలు తినడం మంచిది..

గోధుమ రవ్వ – పిండి: గోధుమల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. గోధుమ రవ్వ, పిండి తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. అందుకే ఆహారంలో పిండిని, రవ్వను చేర్చుకోవడం మంచిది.

బెర్రీలు: తక్కువ పిండి పదార్థాలు తినాలనుకునే వారు బ్లాక్‌బెల్లీ, స్ట్రాబెర్రీలను తీసుకోవచ్చు. బెర్రీస్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల, మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే, ఆహారంలో బెర్రీలను చేర్చుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

అవిసె గింజలు – చియా విత్తనాలు: పోషకాలు అధికంగా ఉండే అవిసె గింజలు, చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణం కావడానికి పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. దీనితోపాటు చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో అవిసెగింజలు, చియా విత్తనాలు సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

బ్రోకోలి: బ్రోకోలిలో చాలా ఫైబర్ ఉంటుంది. అయితే ఇందులో తక్కువ మొత్తంలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్