Hero Naga Shaurya: సొమ్మసిల్లి పడిపోయిన నాగశౌర్య.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్ లో ఉండగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ప్రజంట్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది.

Hero Naga Shaurya: సొమ్మసిల్లి పడిపోయిన నాగశౌర్య.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు
Hero Naga Shaurya
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2022 | 4:41 PM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత గురయ్యారు. షూటింగ్‌లో ఉన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే శౌర్యను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఎండలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుండగా ఆయన పడిపోయినట్లు తెలుస్తుంది. సిక్స్ ప్యాక్ కోసం కొంతకాలంగా  లిక్విడ్స్ తక్కువగా తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతోనే ఇలా జరిగిందని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారనే వార్తతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ప్రజంట్ శౌర్య చేతిలో ‘నారీ నారీ నడుమ మురారి’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘పోలీసు వారి హెచ్చరిక’ మూవీస్ ఉన్నాయి. ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తన నటనకుగానూ మంచి కామెంట్స్ అందుకున్నాడు.

ఇటీవలే మ్యారేజ్ అనౌన్స్ చేసిన శౌర్య

ఇటీవలే నాగశౌర్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన పెళ్లి ఫిక్స్ అయ్యింది. నవంబరు 20న వీరి వివాహానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. బెంగళూరులోని ఓ హోటల్లో వీరి మ్యారేజ్ బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని టాలీవుడ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.