Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Krishna Health: ఆందోళనకరంగానే సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఆస్పత్రిలోనే మహేష్‌

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బాడీ ట్రీట్‌మెంట్‌కు సహకరించడం లేదని వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు గడిస్తే కాని పరిస్థితిని అంచనా వేయలేమని వైద్యులు అంటున్నారు.

Superstar Krishna Health: ఆందోళనకరంగానే సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఆస్పత్రిలోనే మహేష్‌
Actor Krishna Health Update
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2022 | 4:10 PM

సూపర్‌ స్టార్‌ కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. అర్థరాత్రి కృష్ణకు కార్డియాక్‌ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందించారు. కృష్ణకు ముందుగా సీపీఆర్‌ చేశారు. రాత్రి నుంచి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. అన్ని టెస్టులు చేస్తున్నామని..ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేయనున్నారు.

అర్థరాత్రి కార్డియాక్‌ అరెస్ట్‌తో వచ్చారు. ఇంటెన్సివ్‌ కేర్‌లో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన క్రిటికల్‌ స్టేజ్‌లోనే ఉన్నారని..వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. ఇకపై ప్రతి గంట కీలకమన్నారు. 24గంటల్లో ఆయన పరిస్థితిపై క్లారిటీ వస్తుందని..క్రిటికల్‌ పొజిషన్‌లో ఉన్నా బెస్ట్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. కృష్ణకు ఇంటర్‌నేషనల్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామంటున్నారు వైద్యులు. చివరి క్షణం వరకు ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు. ప్రస్తుతం ఆయన అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని..ఆయన కోలుకోవాలని మనందరం ప్రార్థిద్దామన్నారు. 9ఏళ్లుగా కృష్ణకు కాంటినెంటల్‌ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్స్‌ కూడా అక్కడే జరుగుతుంటాయి. దీంతో అర్థరాత్రి గుండెపోటు వచ్చిన వెంటనే నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు మహేశ్ బాబు. డాక్టర్లను అడిగి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం కృష్ణకు 79 ఏళ్లు. ఆయనకు మంచి ట్రీట్‌మెంట్‌ అందుతోందని..అభిమానులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. కృష్ణ చాలా ధృడంగా ఉండే మనిషంటున్నారు. ఇక కాంటినెంటల్‌ ఆస్పత్రికి పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు కృష్ణ పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఆసుపత్రి నుంచి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..