Vijayawada: రూ.50 లక్షల సరుకు సీజ్ చేసిన ఏపీ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. కానీ, రైల్వే అధికారులు ఎంటరవ్వడంతో..

అక్రమార్కులకు షాక్ ఇచ్చారు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. ఎటువంటి బిల్లులు లేని రూ. 50లక్షల విలువ చేసే వస్తువులను సీజ్ చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.

Vijayawada: రూ.50 లక్షల సరుకు సీజ్ చేసిన ఏపీ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. కానీ, రైల్వే అధికారులు ఎంటరవ్వడంతో..
Vijayawada
Follow us

|

Updated on: Nov 15, 2022 | 5:38 AM

అక్రమార్కులపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కొరడా ఝులిపించారు. రైల్వే ట్రాన్స్ పోర్ట్‌ను ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్న అక్రమార్కులకు అడ్డుకట్టవేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ లోని 8వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై భారీగా సరుకు పట్టుకున్నారు. ఎటువంటి బిల్లులు లేని 50 లక్షల విలువైన వస్తువులను సీజ్ చేశారు. కానీ, తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ రైల్వే అధికారులు ప్రశ్నించడంతో.. ట్యాక్స్, రైల్వే అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తనిఖీల్లో నకిలీ గోల్డ్‌తో పాటు, భారీగా సిల్వర్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, చెప్పులు, పలు రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 10 బృందాలు పార్సిల్ కార్యాలయంతో పాటు రైళ్లలో తనిఖీలు చేశారు. పట్టుబడ్డ సామాగ్రి గూడ్స్ ట్రైన్ లో ఢిల్లీ పటేల్ నగర్ నుండి విజయవాడకు వచ్చినట్లు గుర్తించారు. ఎటువంటి బిల్లులు లేని సరుకును అధికారులు సీజ్ చేశారు.

ఈ ఘటనలో రైల్వే పోలీసులకు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అనుమతి లేకుండా తనిఖీలు చేశారంటూ రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఎందుకు తనిఖీలు చేశారని నిలదీశారు.

కమర్షియల్ ట్యాక్స్ అధికారులను రైల్వే అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చేసేందేం లేక సీజ్ చేసిన సరుకును అక్కడే వదిలేసి వెనక్కి వెళ్లిపోయారు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. విజయవాడ రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారుల మధ్య గొడవ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు