Watch Video: చేపల కోసం సముద్రంలో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి ఒక్కసారిగా తన్మయత్వం

ఇది నిజంగా అద్భుత ఘటనే. ఆ జాలరి ఇప్పటికీ ఆశ్చర్యంలో ఉన్నాడు. అసలు సముద్రంలోకి అయ్యప్ప విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అంతు చిక్కకుండా ఉంది.

Watch Video: చేపల కోసం సముద్రంలో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి ఒక్కసారిగా తన్మయత్వం
Ayyappa idol caught in fisherman net
Follow us

|

Updated on: Nov 15, 2022 | 9:35 AM

కాకినాడ జిల్లా.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. అచ్చం దశావతారం సినిమాలో మాదిరి ఘటన రిపీట్ అవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ మూవీలో విష్ణుమూర్తి విగ్రహం ఏ విధంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిందో అదే రీతిలో.. కడలి నుంచి అయ్యప్ప స్వామి విగ్రహం ఉద్భవించింది. సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సూరాడ శివ అనే మత్స్యకారుడు వలలో అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది.  చేపల కోసం వేసిన వల బరువుగా అనిపించడంతో.. దాన్ని లాగిన మత్స్యకారుడు.. లోపల అయ్యప్ప విగ్రహం ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. తోటి మత్స్యకారుల సహాయంతో ఒడ్డుకి చేర్చాడు. ఆపై విగ్రహాన్ని సుబ్బంపేట రామాలయాలని తీసుకెళ్లారు.

విషయం తెలియడంతో అక్కడికి స్థానికులు పోటెత్తుతున్నారు. రాతితో చెక్కబడి.. చెక్కుచెదరని సుందర రూపంలో కూడిన విగ్రహం కావడంతో అందరూ సర్‌ప్రైజ్ అవుతున్నారు.  ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలలోని అయ్యప్ప స్వామి భక్తులకు తెలియడంతో ఒక్కొక్కరిగా చేరుకుని పూజలు చేస్తున్నారు. కడలి నుంచి తమ వల ద్వారా ఒడ్డుకు చేరిన అయ్యప్ప విగ్రహానికి  గుడి కట్టే ఆలోచనలో ఉన్నారు స్ధానిక మత్స్యకారులు.

ప్రజంట్ అయ్యప్ప భక్తులు మాలలు ధరించే సమయం. అందునా అయ్యప్ప విగ్రహాన్ని ఎవ్వరూ నిమజ్జనం చేయరు. దీంతో ఆ అయ్యప్ప విగ్రహం ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందో అర్థం కావడం లేదు. ఇది హరిహర పుత్రుడి మహత్యమే అంటున్నారు భక్తులు. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వానికి లోనవుతున్నారు. ఆ విజువల్స్ దిగువన ఇస్తున్నాం మీరు కూడా చూడండి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..