AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: హీరోయిన్‍‏తో ప్రేమాయణం పై క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్.. సారా అలీ ఖాన్ రియాక్షన్ ఏంటంటే..

తాజాగా సారా అలీ ఖాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు శుభ్‏మన్ గిల్.

Sara Ali Khan: హీరోయిన్‍‏తో ప్రేమాయణం పై క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్.. సారా అలీ ఖాన్ రియాక్షన్ ఏంటంటే..
Shubhman Gill, Sara Ali Kh
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2022 | 9:56 AM

Share

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్ శుభ్‏మన్ గిల్‏తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక కొద్ది రోజులుగా వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్ .. ఎయిర్ పోర్టులో కనిపించడం.. అలాగే నెట్టింట ఫోటోలకు పరస్పరం కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో వీరిద్దరు నిజంగానే రిలేషన్‏ షిప్‏లో ఉన్నారంటూ ఇండస్ట్రీలో రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే తమ బంధం గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడం పై వీరిద్దరి అధికారికంగా స్పందించలేదు. తాజాగా సారా అలీ ఖాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు శుభ్‏మన్ గిల్.

ఇటీవల ఓ పంజాబీ చాట్ షోలో పాల్గొన్న గిల్‏కు సారాకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా ? అంటూ హోస్ట్ ప్రశ్నిచంగా.. సారా కా సారా సచ్ బోలో ( సారా గురించి ఉన్నది ఉన్నట్లుగా మొత్తం నిజం చెప్పేయాలి) అనగా.. సారా కా సారా సచ్ బోల్ దియా (సారా గురించి మొత్తం చెప్పేశాను.. నేను డేటింగ్‏లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఫిట్‏గా ఉండే నటి ఎవరు అడగ్గా.. సారా అని ఠక్కున చెప్పేశాడు. దీంతో గిల్.. సారా నిజంగానే ప్రేమలో ఉన్నట్లు గిల్ కన్ఫామ్ చేశాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అయితే గిల్ కామెంట్స్ పై హీరోయిన్ సారా ఇంకా స్పందించలేదు.

అయితే గతంలో శుభ్ మన్ గిల్..క్రికెట్ లెజెంట్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‏తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపించింది. ఇక అనుహ్యంగా కొద్దిరోజులుగా హీరోయిన్ సారాతో కలిసి కెమెరాకు చిక్కడంతో సారాతో బ్రేకప్ అయ్యిందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. శుభ్ మన్ గిల్ 2017 ఫిబ్రవరిలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.