- Telugu News Entertainment Bollywood Aishwarya Rai's Birthday Post For Daughter Aaradhya Brings Out The Trolls
Aaradhya Birthday: ‘ఐశ్వర్య! కూతురికి బర్త్‌డే విషెస్ చెప్పేది.. ఇలాగేనా..?’ నెటిజన్ల ట్రోల్స్.. ఏంజరిగిందంటే
ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ నవంబర్ 16న బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ కూతురుతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే..
Updated on: Nov 16, 2022 | 10:36 AM

ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ నవంబర్ 16న బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ కూతురుతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఐశ్వర్య తన కూతురిని ముద్దుపెట్టుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఐతే కూతురి బుగ్గలపై, నుదుటిపై కాకుండా పెదవులపై పెట్టింది.

'మై లవ్.. మై లైఫ్. ఐ లవ్ యూ మై ఆరాధ్య' అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఐశ్యర్య. అంతే..

మాజీ మిస్ యూనివర్స్ తన కూతురికి ఈ స్టైల్‌లో బర్త్‌డే విషెస్ చెప్పడం నెటిజన్తకు సుతారం నచ్చలేదు. ఇది మన సంస్కృతి కాదు. వెస్ట్రన్ కల్చర్ అని, పబ్లిసిటీ కోసం ఇంత నీచంగా ఫొటోలు పెట్టాలా..? అంటూ కొందరు మండిపడుతున్నారు.

'తల్లీ, బిడ్డల సంబంధాన్ని జడ్జ్ చేయడం ఆపండి. అది కేవలం ముద్దు. ఆమె తన బిడ్డకు అమ్మ. ఈ ఫొటో బిడ్డపై తల్లికున్న స్వచ్ఛమైన ప్రేమ, మమకారాన్ని చూపుతోంది. ప్రతి విషయాన్ని వక్రదృష్టితో చూడడం మానండి'.. అని మరికొందరు సపోర్ట్ చేశారు. కూతురు పట్ల ఐశ్వర్య చూపుతున్న శ్రద్ధ కారణంగానే ఎన్నోసార్లు ట్రోల్‌కు గురైంది ఐశ్చర్యరాయ్ బచ్చన్.




