Tamannaah: మిల్కీ బ్యూటీకి కాబోయే మొగుడు ఇతనే.. వారికి గట్టిగానే ఇచ్చి పడేసిందిగా..

ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను తమన్నా పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి ఫిక్స్ అయినందునే కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదని సోషల్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్లు కథనాలు అల్లేశాయి.

Tamannaah: మిల్కీ బ్యూటీకి కాబోయే మొగుడు ఇతనే.. వారికి గట్టిగానే ఇచ్చి పడేసిందిగా..
Tamannaah Bhatiata
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2022 | 6:10 AM

శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా భాటియా. తన అందం, అభినయంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మిల్కీ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 15 ఏళ్లుగా తనదైన నటనతో అలరిస్తోన్న ఈ అందాల తార గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సొగసరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను తమన్నా పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి ఫిక్స్ అయినందునే కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదని సోషల్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్లు కథనాలు అల్లేశాయి. ఈ పుకార్లు అభిమానులకే కాదు తమన్నా వద్దకూ చేరినట్టున్నాయి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన మ్యారేజ్‌ గురించి రూమర్లు రాసిన వారికి గట్టిగా కౌంటర్‌ ఇచ్చిందీ బ్యూటీ క్వీన్‌. ‘ఇతనే నా భర్త (బిజినెస్‌ మెన్‌)’ అంటూ ఇటీవల తాను నటించిన ఎఫ్‌ 3 సినిమాలోని పాత్రకు సంబంధించిన క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేసింది. దీనికి మ్యారేజ్‌ రూమర్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేసింది. ఎఫ్‌ 3 చిత్రంలో తమన్నా కొన్ని సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దృశ్యాలనే షేర్‌ చేసి పెళ్లి రూమర్ల వ్యాపింపజేస్తున్నవారికి గట్టిగా ఆన్సర్‌ ఇచ్చింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల బబ్లీ బౌన్సర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా. త్వరలోనే సత్యదేవ్‌తో కలిసి నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే భోళా శంక‌ర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా న‌టిస్తోంది. వీటితోపాటు ఆమె డైరీలో పలు తమిళ్, హిందీ, మలయాళ సినిమాలున్నాయి. కాగా పెళ్లి విషయంలో ఒకసారి మాట్లాడుతూ.. తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని చెప్పుకొచ్చింది. సో.. ఈ పెళ్లి వార్తలు కూడా పుకార్లేనని క్లారిటీ వచ్చేసిందన్న మాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?