AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Krishna: మీరే మా జీవితానికి సూపర్‌ స్టార్‌.. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం.. మంజుల ఎమోషనల్‌

కృష్ణ మరణం పట్ల ఆయన కూతురు మహేశ్‌ సోదరి మంజుల ఘట్టమనేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నాన్నతో తన అనుబంధాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురైంది. తమ పట్ల మీరు చూపించిన ప్రేమానురాగాలు చిరకాలం మాతోనే ఉంటాయని నాన్నతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంది.

Superstar Krishna: మీరే మా జీవితానికి సూపర్‌ స్టార్‌.. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం.. మంజుల ఎమోషనల్‌
Krishna,manjula Ghattamaneni
Basha Shek
|

Updated on: Nov 16, 2022 | 7:00 AM

Share

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూతతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకు కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పిస్తున్నారు. మహేశ్‌బాబు కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యం చెబుతున్నారు. ఈనేపథ్యంలో కృష్ణ మరణం పట్ల ఆయన కూతురు మహేశ్‌ సోదరి మంజుల ఘట్టమనేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నాన్నతో తన అనుబంధాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురైంది. తమ పట్ల మీరు చూపించిన ప్రేమానురాగాలు చిరకాలం మాతోనే ఉంటాయని నాన్నతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా తండ్రి మరణాన్ని తలచుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘నాన్నా. మీరు ప్రపంచానికే సూపర్ స్టార్. మా కోసం మీరు చూపించిన ప్రేమ చిరకాలం మాతోనే ఉంటుంది. ఏది ఏమైనా మీరే మా జీవితానికి సూపర్ ‍స్టార్. కళామతల్లికి మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. లవ్‌ యూ నాన్నా..’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది ముంజుల. ప్రస్తుతం ఈపోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెను ఓదార్చుతూ కామెంట్లు పెడుతున్నారు. కృష్ణ గారి మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా నానక్‌రామ్‌గూడ నివాసంలోని కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈరోజు (నవంబర్‌16)న ఉదయం 9 గంటలకు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు తరలిస్తారు. మధ్యాహ్నం 12.30 వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు