Krishna: విషాదవదనంలో తెలుగు సినీ పరిశ్రమ.. కృష్ణ మృతికి సంతాపంగా నేడు షూటింగ్స్ బంద్..

కృష్ణ మృతితో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఇంటి దగ్గర రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు.

Krishna: విషాదవదనంలో తెలుగు సినీ పరిశ్రమ.. కృష్ణ మృతికి సంతాపంగా నేడు షూటింగ్స్ బంద్..
Krishna Tollywood
Follow us

|

Updated on: Nov 16, 2022 | 8:42 AM

తెలుగు లెజండరీ నటులు, సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు. అభిమానుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోకి భౌతికకాయం తరిలిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానులు సందర్శించుకునేలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత మహా ప్రస్ధానంలో అంత్యక్రియులు జరగనున్నాయి. కృష్ణ మృతితో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఇంటి దగ్గర రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు.

మరోవైపు కృష్ణ మృతి, అంత్యక్రియల నేపధ్యంలో ఇవాళ టాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు. నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఏపీలో కూడా మార్నింగ్‌ షోలను రద్దు చేశారు, సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ బుధవారం మూసివేయడం జరుగుతుంది.

ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.