Krishna: అభిమాన హీరోను కడసారి చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. కృష్ణ అంత్యక్రియలపై తాజా వివరాలు..

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న భౌతికకాయాన్ని చూసి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు నానక్‌రామ్‌గూడలో ఉన్న పార్ధివదేహాన్ని మరి కాసేపట్లో అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్‌కి తరలించనున్నారు.

Krishna: అభిమాన హీరోను కడసారి చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. కృష్ణ అంత్యక్రియలపై తాజా వివరాలు..
Krishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2022 | 8:42 AM

అభిమాన నటుడిని కడసారి చూసేందుకు ఫ్యాన్స్‌ తరలి వస్తున్నారు. మరి కొన్ని గంటలే పార్థీవదేహం కనిపిస్తుందన్న ఆందోళనతో.. ఎలాగైనా చూడాలన్న ఆవేదనతో ఉన్నారు ఫ్యాన్స్‌. దీంతో ఎక్కడెక్కడో ఉన్న అభిమానులు నగరానికి క్యూ కట్టారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న భౌతికకాయాన్ని చూసి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు నానక్‌రామ్‌గూడలో ఉన్న పార్ధివదేహాన్ని మరి కాసేపట్లో అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్‌కి తరలించనున్నారు. ఉదయం 8 గంటలకు కృష్ణ ఇంటి నుంచి పద్మాలయ స్టూడియోకి భౌతికకాయాన్ని తీసుకొస్తారు. అక్కడ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక భద్రతను రంగంలోకి దింపారు. కృష్ణతో పాటు మహేష్‌ ఫ్యాన్ష్‌ పెద్ద ఎత్తున తరలి వచ్చే ఛాన్స్‌ ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అభిమానుల సందర్శనార్ధం కృష్ణ పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలోనే ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తారు. 12 గంటల తర్వాత అంతిమ యాత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. పోలీసుల గౌరవవందనం తర్వాత అంత్యక్రియలు ముగుస్తాయి. అంతకు ముందు.. కృష్ణ అంతిమ యాత్ర పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మొదలవుతుంది. అమీర్‌ పేట్‌లోని పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మొదలయ్యే అంతిమ యాత్ర జుబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ మీదుగా మహాప్రస్తానం వరకు సాగుతుంది. దారి పొడవునా పార్ధివదేహాన్ని చూసేందుకు ఫ్యాన్స్‌ వస్తారన్న అంచనాతో భద్రతా పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారు ఏపీ సీఎం జగన్‌. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చే జగన్‌.. అక్కడి నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకొని పార్ధివదేహానికి నివాళి అర్పిస్తారు. హీరో మహేష్‌ బాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు సీఎం జగన్‌. కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఇవాళ ప్రముఖులు రానున్నారు. సిని పరిశ్రమ పెద్దలతో పాటు, రాజకీయాలకు అతీతంగా పలువురు రాష్ట్ర, జాతీయ నేతలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. తమ అభిమాన నటుడు, అభిమాన నేతను కడసారి చూసి శ్రద్ధాంజలి ఘటించేందుకు పలువురు హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో… తెలుగు సినీపరిశ్రమ శోకసంద్రంలో మునిగి పోయింది. పెద్దదిక్కును కోల్పోయామన్న ఆవేదనకు గురవుతోంది. వయసుతో భేదం లేకుండా అందరిని అప్యాయంగా పలుకరించే కృష్ణ.. ఇక లేరన్న నిజాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్ధివదేహం దగ్గరికి వచ్చిన పలువురు కన్నీటి పర్వంతమవుతున్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూయడం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నానక్‌రాంగూడలోని కృష్ణ ఇంటికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు కడసారి ఆయన భౌతికకాయాన్ని చూసి నివాళ్లు అర్పించారు. కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ నేడు బంద్‌ పాటించనుంది. ఈ మేరకు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.