Comedian Ali: మెగాస్టార్‌ చిరంజీవిని కలిసిన అలీ దంపతులు.. కుమార్తె పెళ్లికి రావాలని ఆహ్వానం

ఇటీవలే ఏపీ ఎలక్ర్టానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులైన అలీ సీఎం జగన్‌ను కలిశారు. తమ కుమార్తె పెళ్లికి రావాలని వెడ్డింగ్‌ కార్డ్‌ అందజేశారు. ఆతర్వాత తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. తాజాగా గురువారం నాడు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు అలీ దంపతులు.

Comedian Ali: మెగాస్టార్‌ చిరంజీవిని కలిసిన అలీ దంపతులు.. కుమార్తె పెళ్లికి రావాలని ఆహ్వానం
Ali Zubeda, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2022 | 7:51 AM

ప్రముఖ నటుడు, కమెడియన్‌ అలీ ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులకు, బంధుమిత్రులతో పాటు సినీ పెద్దలు, రాజకీయ నాయకులు అందరికీ ఆహ్వానం అందిస్తున్నారు ఆలీ. ఇటీవలే ఏపీ ఎలక్ర్టానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులైన అలీ సీఎం జగన్‌ను కలిశారు. తమ కుమార్తె పెళ్లికి రావాలని వెడ్డింగ్‌ కార్డ్‌ అందజేశారు. ఆతర్వాత తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. తాజాగా గురువారం నాడు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు అలీ దంపతులు. చిరు నివాసానికి వెళ్లిన అలీ దంపతులు ఆయనకు తమ కూతురు పెళ్లి పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హజరై నూతన వధూవరులకు ఆశీస్సులు అందించాలని చిరంజీవిని కోరారు. కాగా అలీ కూతురు పెళ్లి పత్రిక తీసుకున్న చిరు.. ఈ పెళ్లికి తప్పకుండా హాజరవుతానని చెప్పారట. ఈ సందర్భంగా అలీ దంపతులతో కలిసి ఫొటోలు కూడా దిగారు చిరంజీవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిఈ సందర్భంగా అలీ దంపతులు చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను జుబేదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

కాగా అలీ కుమార్తె ఫాతిమా రెమీజు మెడిసిన్ చదువుతుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబ సభ్యులు, కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా నిశ్చితార్ధాన్ని అట్టహాసంగా జరిపించాడు ఆలీ. తాజాగా హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కొత్త పెళ్లి కూతురు ఫాతిమా పసుపు వర్ణం దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది. సినిమా పరిశ్రమకు చెందిన అలీ తన కూతురును.. కుటుంబం మొత్తం వైద్యులతో నిండిన ఒక కుటుంబానికి కోడలిగా పంపించనున్నారట. ఫాతిమాకు కాబోయే వరుడు కూడా డాక్టరేనట.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Zubeda Ali (@zubedaspage)

View this post on Instagram

A post shared by Zubeda Ali (@zubedaspage)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..