Actress: నడుమందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా? బుల్లితెరపై బోలెడు క్రేజ్‌

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టీవీ రియాలిటీ షోలు, డ్యాన్స్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది.

Actress: నడుమందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా? బుల్లితెరపై బోలెడు క్రేజ్‌
Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2022 | 8:29 AM

పై ఫొటోలో నడుమందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న భామ ఓ స్టార్‌ యాంకర్‌. ముద్దుముద్దు మాటలు, కామెడీ పంచులతో బుల్లితెరపై బోలెడు పాపులారిటీ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టీవీ రియాలిటీ షోలు, డ్యాన్స్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే కొన్ని తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది. అన్నట్లు సోషల్‌ మీడియాలోనూ ఈమెకు బోలెడుమంది అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ యాంకర్ నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. వాటికి నెటిజన్ల నుంచి మంచి రెస్సాన్స్‌ వస్తుంటుంది. ఇలా నిత్యం హాట్‌ హాట్ ఫొటోషూట్లతో వార్తల్లో నిలిచే ఈ సొగసరి తాజాగా ప్రకృతి ఒడిలో పరవశించిపోయింది. ఫొటో షూట్‌లో భాగంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది. వివిధ రకాల స్టిల్స్‌లో ఫొటోలు తీయించుకుంది. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి నడుమందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ సొగసరి మరెవరో కాదు..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Varshini (@varshini_sounderajan)

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ వర్షిణి.. హైదరాబాద్‌లోనే పెరిగిన ఈ ముద్దుగుమ్మ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా నటించింది. లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో కూడా కనిపించింది. ఇక అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన పెళ్లిగోల అనే వెబ్ సిరీస్‌లో వర్షిణీ అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సుమంత్‌ నటించి మళ్లీ మొదలైంది సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌లో సందడి చేసింది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోన్న శాకుంతలంలోనూ ఈ సొగసరి నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.