Krishna: కృష్ణ సినీ జీవితంలో పద్మాలయ స్టూడియో ప్రత్యేక బంధం.. ఎన్నో రికార్డులకు నిలయం..

నటదిగ్గజం కృష్ణ జీవితంలో పద్మాలయ స్టూడియో గురించి తప్పక మాట్లాడుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల సహకారంతో నిర్మాణమైన సంస్థ నుంచి తెలుగుతోపాటు .. బాలీవుడ్‌ సినిమాలు, సీరియళ్లు సైతం భాగస్వామ్యమయ్యాయి.

Krishna: కృష్ణ సినీ జీవితంలో పద్మాలయ స్టూడియో ప్రత్యేక బంధం.. ఎన్నో రికార్డులకు నిలయం..
Krishna, Padmalaya Studios
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2022 | 8:41 AM

కృష్ణ సినీ జీవితంలో పద్మాలయ స్టూడియో పాత్ర విడదీయరానిది. సంస్థ నిర్మాణమే ఓ వైవిద్యం. స్టూడియో ఏర్పాటులో ఇద్దరు ముఖ్యమంత్రులు మమేకమైన అరుదైన చరిత్ర.. పద్మాలయ స్టూడియోకే సొంతం. నటదిగ్గజం కృష్ణ జీవితంలో పద్మాలయ స్టూడియో గురించి తప్పక మాట్లాడుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల సహకారంతో నిర్మాణమైన సంస్థ నుంచి తెలుగుతోపాటు .. బాలీవుడ్‌ సినిమాలు, సీరియళ్లు సైతం భాగస్వామ్యమయ్యాయి. నాటి సీఎం భవనం వెంకట్రామ్‌ హయాంలో స్టూడియో కోసం పదెకరాల స్థలం ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో సూపర్‌ స్టార్‌ కృష్ణ స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం1983 నవంబరు 21న సీఎం ఎన్టీఆర్‌ స్టూడియోను ప్రారంభించారు.

తొలిసారిగా సింహాసనం చిత్రానికి ఔట్‌డోర్‌ సెట్స్‌ వేసి రికార్డు సృష్టించిన ఘనత పద్మాలయ స్టూడియో సొంతం.1980లో పద్మాలయ స్టూడియో నుంచి షూటింగ్‌ జరపుకున్న తొలి బాలీవుడ్‌ చిత్రంగా టక్కర్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. పద్మాలయ స్టూడియోలో నిర్మించిన ఎన్నో చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. వాటిలో ప్రత్యేకించి ఊరికి మొనగాడు, చుట్టాలున్నారు జాగ్రత్త, పాతాళభైరవి వంటి చిత్రాలు 175 రోజులకు పైగా ఆడి దేశంలోనే సంచలనంగా మారాయి.

ఒక్క హైదరాబాద్‌లోనే 18 లక్షలకు పైగా వసూలు చేసిన చిత్రంగా సింహాసనం నిలవడం.. కృష్ణ నటనకు నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినీ చరిత్రను ప్రపంచానికి చాటిన పద్మాలయ స్టూడియో నుంచి భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు రావాలని.. కృష్ణ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుతున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.