AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్.. ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా?

దాదాపు పెద్ద హీరోలందరూ సినిమాల్లో హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. బుల్లితెరపై కూడా సత్తాచాటింది. అదే సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Actress: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్.. ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా?
Actress
Basha Shek
|

Updated on: Nov 17, 2022 | 5:55 AM

Share

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా తారల చిన్ననాటి ఫొటోలు నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి. అభిమానులు కూడా తమ ఫేవరేట్‌ హీరోల, హీరోయిన్ల ఛైల్డ్‌హుడ్ ఫొటోస్‌ను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పుట్టినరోజు, పెళ్లివేడుకల్లో ఈ త్రో బ్యాక్‌ ఫొటోలు బాగా వైరలవుతున్నాయి. అలా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. పై ఫోటోలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. దాదాపు పెద్ద హీరోలందరూ సినిమాల్లో హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. బుల్లితెరపై కూడా సత్తాచాటింది. అదే సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అందమైన పాపను ఎవరైనా గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు ఏపీ మంత్రి రోజా. 1972 నవంబర్ 17 న ఇదే రోజు పుట్టారామె. ఈనేపథ్యంలో రోజా పుట్టిన రోజు పురస్కరించుకుని ఆమె అభిమానులు ఆమె ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రేమ తపస్సు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అందాల తార సీతారత్నం గారబ్బాయి, ముఠామేస్త్రి , భైరవ ద్వీపం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. సినిమాల్లో బిజీగా ఉండగానే తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమాలు, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనమూ కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..