Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణకు చిరంజీవి వీరాభిమాని.. ఆయన పేరిట ఏకంగా అభిమాన సంఘం ఏర్పాటు..
Superstar Krishna passed away: ‘ఆకాశంలో ఒక తార.. నాకోసం వచ్చింది ఈ వేళ’ అంటూ యావత్ తెలుగు సమాజాన్ని షేక్ చేసిన ఆ ధృవ తార ఇప్పుడు లేదు.
‘ఆకాశంలో ఒక తార.. నాకోసం వచ్చింది ఈ వేళ’ అంటూ యావత్ తెలుగు సమాజాన్ని షేక్ చేసిన ఆ ధృవ తార ఇప్పుడు లేదు. తనకోసం వచ్చిందనుకున్న ఆ తార చెంతకే.. ఈ తార చేరింది. తెలుగు సినిమా చలన చిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ నిలబడిన కృష్ణకు.. లెక్కలేనంత అభిమానులు ఉన్నారు. నందమూరి తారకరామారావు తరువాత అంతటి క్రేజ్, అభిమానులు ఆయన సొంతం. కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవంటే.. ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు రాష్ట్రంలోనూ ఊరూరా కృష్ణ అభిమాన సంఘాలు ఉండేవి. కృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా వేడుకలు నిర్వహించేవారు. కృష్ణ పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. నాడు వార్తాపత్రికలు పండుగే అని చెప్పాలి. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేవారు. తర్వాత దశలో కృష్ణ అభిమాన సంఘాలు, నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమైపోయి సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి.
చిరంజీవి అధ్యక్షుడు..
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కృష్ణకు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అవును, సూపర్ స్టార్ కృష్ణ అంటే చిరంజీవికి ఎనలేని అభిమానం. చిరంజీవి యువకుడిగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిగా ఉండేవారు. ఈ క్రమంలోనే.. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు నేటి మెగాస్టార్. ‘తోడు దొంగలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ అభిమాన సంఘం పేరిట విడుదల చేసిన కరపత్రం నేటికీ చాలా స్పెషల్‌గా నిలుస్తోంది. ఇక కృష్ణ.. అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి.. సినిమాల్లోకి రావడానికి కూడా కృష్ణను స్ఫూర్తిగా తీసుకున్నారని అంటుంటారు.
Padmalaya Krishna Fans association president chiranjeevi ❤️#HBDLegendarySSKgaru #SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/06Ev4aNj2d
— Milagro Movies (@MilagroMovies) May 31, 2021
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..