Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. 17 నుంచి శబరిగిరీశుడి దర్శనం.. ఈసారి టెంపుల్ రూల్స్ ఇవే..

శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు బుధవారం (నవంబర్ 16) నుండి తెరుచుకోనున్నాయి. గురువారం (నవంబర్ 17) నుండి రెండు నెలల పాటు భక్తులను దర్శనం ఇవ్వనున్నారు స్వామి వారు.

Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. 17 నుంచి శబరిగిరీశుడి దర్శనం.. ఈసారి టెంపుల్ రూల్స్ ఇవే..
Sabarimala
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 16, 2022 | 1:59 PM

శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు బుధవారం (నవంబర్ 16) నుండి తెరుచుకోనున్నాయి. గురువారం (నవంబర్ 17) నుండి రెండు నెలల పాటు భక్తులను దర్శనం ఇవ్వనున్నారు స్వామి వారు. వార్షిక మండలం-మకరవిలుక్కు యాత్ర కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు (తంత్రి) కందరారు రాజీవ, మాజీ ప్రధాన అర్చకులు ఎన్. పరమేశ్వరన్ నంబూద్రి సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులు తెరుస్తారు. అనంతరం అయ్యప్ప, మలికాపురం ఆలయాల ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ కార్యక్రమాలు డిసెంబర్ 27న ముగియనున్నాయి.

ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆలయంలో ప్రజల దర్శనానికి అనుమతి ఉండదు. డిసెంబర్ 30వ తేదీ నుంచి మకరవిలుక్కు యాత్ర కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మకరవిళక్కు(మకర జ్యోతి) దర్శనం ఉంటుంది. ఇతర పూజా కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఏడాది శబరిమల యాత్ర సీజన్ అక్కడితో ముగుస్తుంది.

కాగా, కోవిడ్-19 ఆంక్షల కారణంగా గత రెండేళ్లుగా భక్తులు శబరమలకు చేరుకోలేకపోయారు. ఈసారి ఆంక్షలు సడలించడంతో లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్రకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శబరిమల మార్గంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రత కోసం సుమారు 13,000 మంది సిబ్బందిని మోహరించారు. అయితే, ఈ సంవత్సరం యాత్రికులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. అలాగే, ఒక్కరోజులో గరిష్టంగా 1.2 లక్షల మంది భక్తులకు దరశ్శించుకునే వెసులుబాటు ఉందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..