AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న కోడలు నమ్రత గురించి సూపర్‌ స్టార్‌ కృష్ణ ఏమన్నారో తెలుసా..?

తిరుపతిలో పెళ్లి జరుగుతుందేమోనని ఆరా తీశారట. కానీ, పెళ్లి అనంతరం అందరూ నమ్రతను తమ ఇంటి కోడలుగా సంతోషంగా అంగీకరించారని చెప్పారు.

చిన్న కోడలు నమ్రత గురించి సూపర్‌ స్టార్‌ కృష్ణ ఏమన్నారో తెలుసా..?
Superstar Krishna
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2022 | 7:18 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్, నటశేఖరుడు,సీనియర్ హీరో కృష్ణ నవంబర్‌15 తెల్లవారుజామున కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణ భౌతికకాయానికి వందనం చేశారు. కృష్ణకు కుమారుడు మహేశ్‌బాబు దహన సంస్కారాలు నిర్వహించాడు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణకు అశేష అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, కృష్ణ మరణంతో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు మరోమారు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ తన కోడలు నమ్రతపై చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్‌ చేస్తోంది.

కృష్ణ, ఇందిర దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు, చిన్న కొడుకు మహేష్ బాబు. ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. అయితే, హీరో కృష్ణకు చిన్న కొడలు అంటే మహేష్‌ బాబు భార్య నమ్రతతో ముంబయిలో పెళ్లి జరిపించినట్టుగా కృష్ణ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో హీరో కృష్ణ, విజయనిర్మల మాట్లాడుతూ..నమ్రతతో పెళ్లికి మొదట్లో మహేష్‌ బాబు అమ్మమ్మ అంగీకరించలేదని చెప్పారు. అందుకే ఇంటిల్లిపాది వీరి పెళ్లిని వారి అమ్మమ్మకు తెలియకుండా ముంబయ్‌లో జరిపించామని చెప్పారు. మహేష్ బాబు తల్లి ఇందిర, కృష్ణ విజయనిర్మల కుటుంబ సమేతంగా వెళ్లి నమ్రత,మహేష్‌ల వివాహం జరిపించారట. అయినప్పటికీ మహేష్ బాబు అమ్మమ్మ వీరి పెళ్లిని ఎలాగైన అడ్డుకోవాలని చాలా ప్రయత్నించారట. తిరుపతిలో పెళ్లి జరుగుతుందేమోనని ఆరా తీశారట. కానీ, పెళ్లి అనంతరం అందరూ నమ్రతను తమ ఇంటి కోడలుగా సంతోషంగా అంగీకరించారని చెప్పారు.

మహేష్ బాబు జీవితంలోకి నమ్రత రాక అతనికి ఓ పెద్ద ఊరటనిచ్చిందని చెప్పారు కృష్ణ. మహేష్ బాబు డేట్స్, ఆర్థిక వ్యవహరాలు, పిల్లల బాధ్యతలన్నీ నమ్రతే చూసుకుంటుందని చెప్పారు. మహేష్‌కి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుందని చెప్పారు. నమ్రతకు ఇటు సినిమా ఫిల్డ్‌, వ్యాపార, పలు అంశాల్లో అవగాహన ఉందన్నారు. నమ్రత నిజంగా తెలివైన అమ్మాయి.. షీ ఇజ్‌ క్లేవర్‌ అంటూ చిన్న కొడలిపై ప్రశంసలు కురిపించారు కృష్ణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి