Viral Video: వైభవంగా మేనకోడలి పెళ్లి.. అంతలోనే విషాదం..! డాన్స్‌చేస్తూ ఒక్కసారిగా..(వీడియో)
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ..
పాలిలోని రణవాస్ స్టేషన్‌లో నివసిస్తున్న 42 ఏళ్ల అబ్దుల్ సలీం, భార్య, పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా మేనకోడలి పెళ్లికి హాజరయ్యాడు. నవంబర్ 12న అబ్దుల్ మేనకోడలి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు రోజు రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వేదికపై డ్యాన్స్ చేస్తున్నాడు అబ్దుల్. మేనకోడలి పెళ్లి సందర్భంగా ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తున్న అబ్దుల్ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలాడు. బంధువులు అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించినా అతని శరీరంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో అబ్దుల్ మృతి చెందినట్లు తెలిసింది. దాంతో పెళ్లింట తీవ్ర విషాదం అలముకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

