AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. అది సైకిలా.. షేర్‌ఆటోనా..? ఏకంగా తొమ్మిది మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకున్నాడు..

ఇది ఇండియన్ వీడియో కాదని కొందరు అంటుండగా, చాలా మంది ఆఫ్రికాకు చెందినది అంటున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది..?

వామ్మో.. అది సైకిలా.. షేర్‌ఆటోనా..? ఏకంగా తొమ్మిది మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకున్నాడు..
Bicycle
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2022 | 9:03 PM

Share

ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటింది. ఈ సందర్భంగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఈ రైడర్ ఒకే సైకిల్‌పై 9 మంది పిల్లలను తీసుకువెళుతున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను జైకీ యాదవ్ ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో ఓ వ్య‌క్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకుని వెళుతుండ‌టం క‌నిపించింది. ముగ్గురు పిల్ల‌లు సైకిల్‌ వెనుక కూర్చోగా, వారిపై ఒక‌రు కూర్చున్నారు. ఇక ఇద్ద‌రు పిల్ల‌లు ముందు భాగంలో కూర్చోగా మ‌రొక‌రు ఏకంగా వీల్ టాప్‌పై కూర్చున్నారు. సైకిల్ తొక్కుతున్న వ్య‌క్తి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను త‌న భుజాల‌పై ఎక్కించుకున్నాడు. జైకీ యాద‌వ్ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 1.5 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ క్లిప్‌ను చూసిన నెటిజ‌న్లు విపరీతంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఇంత మంది పిల్ల‌లా అంటూ.. ఓ యూజ‌ర్ కామెంట్‌ చేయగా, బాధ్య‌త‌గా మెల‌గండి..వారిలో అవ‌గాహ‌న పెంచే బాధ్య‌త పాల‌కుల‌దేన‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ సెక్ష‌న్‌లో రాసుకొచ్చారు. ఇది ఇండియన్ వీడియో కాదని కొందరు అంటుండగా, చాలా మంది ఆఫ్రికాకు చెందినది అంటున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!