హైదరాబాద్‌కు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. రాబోయే మూడు రోజులు గజగజే.. జాగ్రత్త

రాబోయే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో వృద్ధులు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని,

హైదరాబాద్‌కు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. రాబోయే మూడు రోజులు గజగజే.. జాగ్రత్త
Cold Wave
Follow us

|

Updated on: Nov 16, 2022 | 8:29 PM

హైదరాబాద్‌లో చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ అంతకంటే తక్కువ నమోదవుతోంది. వారాంతం వరకు చలిగాలులు తగ్గే అవకాశం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో వృద్ధులు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వెచ్చ‌ని దుస్తులు ధ‌రించాల‌ని సూచించింది.

ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, మెద‌క్, నిర్మ‌ల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ విభాగం ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. గురువారం రోజు చ‌లి తీవ్ర‌త అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

గురువారం నాడు హైద‌రాబాద్ న‌గ‌రంలో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే అవ‌కాశం ఉన్నందున‌, న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. బుధ‌వారం న‌గ‌రంలో 13.7 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. 2012లో ఇదే స‌మ‌యంలో 12.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి