Nagashaurya: నాగశౌర్య సెట్లో స్పృహ తప్పడానికి అదే కారణం.. ఆ డైట్‌ను అనుసరిస్తే అంతే సంగతులు అంటోన్న నిపుణులు

సినిమా పాత్రలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే హీరోల్లో నాగశౌర్య కూడా ఒకడు. గతంలో లక్ష్య సినిమా కోసం తన బాడీని విపరీతంగా కష్టపెట్టుకున్న ఈ యంగ్‌ హీరో ఇటీవల తన తాజా సినిమా సెట్స్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.

Nagashaurya: నాగశౌర్య సెట్లో స్పృహ తప్పడానికి అదే కారణం.. ఆ డైట్‌ను అనుసరిస్తే అంతే సంగతులు అంటోన్న నిపుణులు
Naga Shaurya
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2022 | 8:00 AM

సినిమా పాత్రలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే హీరోల్లో నాగశౌర్య కూడా ఒకడు. గతంలో లక్ష్య సినిమా కోసం తన బాడీని విపరీతంగా కష్టపెట్టుకున్న ఈ యంగ్‌ హీరో ఇటీవల తన తాజా సినిమా సెట్స్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. కాగా శౌర్య అనారోగ్యం పాలు కావడానికి అతను ఫాలో అయిన నో వాటర్‌ డైట్‌ లేదా నో లిక్విడ్‌ డైటే కారణమంటున్నారు నిపుణులు. ఈ సినిమాలో కండలు చూపించడం కోసం చిత్ర నిర్మాతలు అతడిని రెండు రోజుల పాటు శరీరాన్ని డీహైడ్రేట్ చేసేలా చేశారనే ప్రచారం జరుగుతోంది. శరీరానికి అవసరమైన మినరల్స్‌ కోల్పోవడం వల్లే తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరాడీ ట్యాలెంటెడ్‌ హీరో. సినిమాల్లో స్లిమ్‌గా కనిపించేందుకు నో వాటర్‌ డైట్‌ను ఫాలో అవ్వడం వల్లే  నాగశౌర్య  స్పృహ తప్పి పడిపోయాడని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు ధృవీకరించారు. అతను తన రాబోయే సినిమా కోసం బరువు తగ్గించుకుని సిక్స్ ప్యాక్ అబ్స్ కోసం వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు..

ఈ నేపథ్యంలో వెన్ ద సోల్ హీల్స్ క్లినికల్ సైకాలజిస్ట్, స్పిరిచ్యువల్ కౌన్సిలర్‌ డాక్టర్ పుల్కిత్ శర్మ News9తో మాట్లాడుతూ ‘ఇటీవలి కాలంలో నటీనటులతో పాటు యువత శారీరక సౌందర్యానికి బాగా ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం బరువు తగ్గించే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇది వారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందని. స్లిమ్‌గా కనిపించేందుకు ఆహారం, నీరుతో పాటు దేనినైనా వదిలేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఇది ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం శౌర్య అనారోగ్య పరిస్థితికి కూడా నో వాటర్‌ డైటే కారణం. శరీరం సరిగ్గా పనిచేయడానికి శరీరంలో కనీస నీటి స్థాయులు ఉండడం చాలా అవసరం. లేకపోతే డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. తేలికపాటి నిర్జలీకరణం కూడా మీ శక్తిని హరించవచ్చు. మిమ్మల్ని త్వరగా అలసిపోయేలా చేస్తుంది.

అందంగా కనిపించాలనే..

స్వచ్ఛమైన నీటిలో క్యాలరీలు ఉండవు. ఇది శరీర బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే నేటి యువత చాలామంది తాగునీటికి బదులు టీ, కాఫీలు, సోడా వంటి క్యాలరీలతో కూడిన పానియాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫలితంగా చెమట పట్టే సమయంలో శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు పోతుంది. అందుకే వ్యాయామం చేస్తుంటే ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామానికి ముందు, తర్వాత నీరు తాగడం ముఖ్యం. అదే సమయంలో నో వాటర్ డైట్‌తో పలు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ‘ నో వాటర్‌ డైట్‌ లను అనుసరించడం ద్వారా వ్యక్తి దీర్ఘకాలంలో వారి శారీరక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. జిమ్‌లలో చనిపోతున్న వ్యక్తుల గురించి ప్రతిరోజూ చాలా వార్తలు వస్తున్నాయి. అందంగా కనిపించాలనే తపనతో తమను తాము కష్టపెట్టుకుంటున్నారు. ఫలితంగా డీహైడ్రేషన్‌, డిప్రెషన్‌ లాంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం కోసం ఆహారాన్ని అనుసరించడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, ఖనిజాలు సమతుల్యమవుతాయి. కానీ మంచిగా కనిపించడం కోసం ఏదైనా అనుసరించడం, కార్బోహైడ్రేట్లు, నీటిని వదులుకోవడం వంటి తెలివితక్కువ ఆహారాన్ని అనుసరించేలా చేస్తుంది” అని డాక్టర్ శర్మ చెప్పుకొచ్చారు. (Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..