Covid-19: విమాన ప్రయాణీకులు మాస్క్ ధరించడం తప్పనిసరి కాదు.. విమానయానశాఖ కీలక ఆదేశాలు..
కోవిడ్ సమయంలో వైరస్ నియంత్రణలో భాగంగా విమాన ప్రయాణీకులంతా మాస్క్ ధరించడం తప్పనిసరని కేంద్ర విమానయాన శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిబంధనను సడ లించింది. విమాన ప్రయాణికులు..
కోవిడ్ సమయంలో వైరస్ నియంత్రణలో భాగంగా విమాన ప్రయాణీకులంతా మాస్క్ ధరించడం తప్పనిసరని కేంద్ర విమానయాన శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిబంధనను సడ లించింది. విమాన ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. మాస్క్ ధరించకపోతే జరిమానా విధించబోమని చెప్పింది. ఎవరైనా కోవిడ్ ముప్పు ఉందని భావిస్తే మాస్క్ ధరించవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన ఆదేశాల్ని విమానయాన శాఖ నవంబర్ 16వ తేదీన జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విమానాల్లో మాస్క్ ధరించాలి అంటూ వచ్చే ప్రకటనలు, సూచనలు కచ్చితం కాదని కూడా చెప్పింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధించడం కూడా లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
మాస్క్ ధరించడం గురించి విమాన ప్రయాణంలో చెప్పే సూచనలు ప్రయాణికుల భద్రత, క్షేమానికి సంబంధించినవి మాత్రమేనని, జరిమానాలు, కచ్చితమైన నిబంధనలకు సంబంధించి కాదని ప్రకటించింది.కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినా ప్రయాణీకులు మాస్క్ లు ధరిస్తే ఆరోగ్య పరంగా మేలు జరుగుతుందని సూచించింది.
ఇప్పటి వరకు విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి చేసింది. మాస్క్ లు ధరించక పోతే విమానాల్లో ఎంట్రీ ఇవ్వకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ నిబంధనలను సడలించండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..