America flight tickets price: బేజారెత్తిస్తున్న అమెరికా విమాన టికెట్ల ధరలు.. అమెరికాలో వచ్చే జనవరి నుంచి మొదలు..
పై చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్ధులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. విమాన ఛార్జీల ధరలు విపరీతంగా పెంచేయడంతో అమెరికా ప్రయాణం అంటేనే బేజారయ్యే పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. అమెరికాలో వచ్చే జనవరి నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది.
ఈ క్రమంలో డిసెంబరు నుంచే విద్యార్థులు అమెరికా ప్రయణానికి సిద్ధమవుతారు. ప్రయాణికుల డిమాండు నేపథ్యంగా డిసెంబరు, జనవరికి సంబంధించి విమానయాన సంస్థలు 50 శాతానికి మించి ఛార్జీలు పెంచేశాయి. బుకింగ్ ఆలస్యమయ్యే కొద్దీ టికెట్ల ధరలు పెరగటం సహజమని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఎఫ్-1 వీసా జారీచేసిన రోజు నుంచి 120 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. వీసా ఉంది కదా అని ధరలు పెరిగే లోపే వెళ్లిపోదామా అంటే కుదరదు. 30 రోజుల కన్నా ముందుగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. డిసెంబరు, జనవరి నెలల్లోనే అత్యధికంగా విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించనుంది.గత పదిరోజుల్లో రెండుసార్లు హెచ్1బి వీసా స్లాట్లను విడుదల చేసింది. రెండు దఫాలుగా ఎఫ్-1 వీసా స్లాట్లను జారీ చేయనున్నట్లు ఇటీవల అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడత విద్యార్థి వీసా స్లాట్లు విడుదల కావాల్సి ఉంది. వీసా జారీ ప్రక్రియ ప్రారంభం కాగానే టికెట్ల బుకింగ్‌కు డిమాండు పెరుగుతుంది. మరోవైపు అమెరికాలో డిసెంబరు నుంచి సెలవుల సీజన్ మొదలవుతుంది. ఈ క్రమంలో అక్కడినుంచి స్వదేశానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దాంతో ఆ టికెట్ల ధరలు కూడా పెరిగిపోయాయి. మామూలు సమయంలో ఒకవ్యక్తి సింగిల్ స్టాప్‌తో అమెరికా వెళ్లి రావటానికి రూ.లక్షన్నర నుంచి రూ.1.75లక్షలు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఒకవైపు వెళ్లటానికే అంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. విమానయాన సంస్థను బట్టి టికెట్ల ధరలు మారుతున్నాయి. ధర ఎక్కువగా ఉన్నా ప్రస్తుతానికి టికెట్ల లభ్యత మెరుగ్గానే ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.