Kakinada: నవగ్రహ విగ్రహాలు లేవు కానీ పూజ చేయాలి.. ఆ అర్చకుడి అద్భుత ఆలోచనకు ఫిదా కావాల్సిందే
మనసుంటే.. మార్గముంటుంది... అలోచన ఉంటే, అద్భుతాలు సృష్టించవచ్చు అని అంటున్నాడు శివాలయం అర్చకుడు కాసుబాబు శర్మ. కాకినాడ జిల్లా, తాళ్లరేవు మండలం శివాలయంలో నవగ్రహావిగ్రహాలకు ప్రత్యామ్నాయంగా వినూత్న ప్రయోగం చేశారు. ఏంటా ప్రయోగం...?
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, కె.గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల మధ్య ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో కాసుబాబు శర్మ నవగ్రహ విగ్రహాలకు బదులుగా నవవృక్షాలు.. ప్రతిష్టించి వినూత్న ప్రయోగాయానికి నాంది పలికారు.శివాలయంలో నందీశ్వరుడు, శివపరివారం, నవగ్రహాలు దర్శనమిస్తాయి.
కానీ ఈ శివాలయంలో నవగ్రహ విగ్రహాలు లేకపోవడంతో… ఆలయ వేద పండితుడు కాసుబాబు నవగ్రహాలకు ప్రీతి పాత్రమైన నవవృక్షాలు ప్రతిష్టించి ఔరా అనిపించారు. నవవృక్షాలకు ప్రత్యేక పూజాలు చేసి ప్రతిష్టంచారు. ఈ ఆలయంలో ఉన్న నవవృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే శని దోషాలు తొలుగుతాయని, అలాగే ఈ దేవతా వృక్షాల చుట్టు తిరిగితే ఆరోగ్యం లభిస్తుందని చెబుతున్నారు.
నవగ్రహాలను వృక్ష రూపంలో చూడాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నవవృక్షాలను ఆలయంలో ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. నవగ్రహ విగ్రహ రూపాలకు బదులుగా వృక్షాలను కలిగి ఉండటం ఇక్కడే మొదటిసారి అని తెలియజేశారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం