Health Tips: పాలు తాగే ముందు, తాగిన తర్వాత ఈ పదార్థాలను అస్సలు తినకండి.. అలా చేస్తే ప్రమాదమే..
ఉరుకులు పరుగుల బిజీలైఫ్‌లో చాలామంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. సాధారణంగా తాగడం లేదా తినే ముందు లేదా ఆ తర్వాత ఆలోచించకుండా పలు పదార్థాలను తీసుకుంటారు.
ఉరుకులు పరుగుల బిజీలైఫ్‌లో చాలామంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. సాధారణంగా తాగడం లేదా తినే ముందు లేదా ఆ తర్వాత ఆలోచించకుండా పలు పదార్థాలను తీసుకుంటారు. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. కానీ కొన్ని ఆహారపదార్థాల కలయిక వల్ల శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి పాలు (Milk).. చాలామంది ఉదయం వేళ పాలను తాగుతారు. అయితే.. పాలు తాగిన తర్వాత పొరపాటున కూడా పలు పదార్థాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, పాలు తాగిన తర్వాత, తాగే ముందు తినకూడని పదార్థాలు (Food) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు తాగిన తర్వాత వీటిని తినకండి..
- నిమ్మకాయ : పాలు తాగిన వెంటనే నిమ్మరసం, లేదా నిమ్మతో చేసిన పదార్థాలను తినకండి. అది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. పాలు తాగిన వెంటనే నిమ్మకాయతో తయారు చేసిన ఏదైనా తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇంకా నిమ్మకాయతో చేసినవి తిన్న తర్వాత కూడా వెంటనే పాలు తాగకండి.
- ముల్లంగి : పాలు తాగిన వెంటనే ముల్లంగిని తినకూడదు. దీనివల్ల జీర్ణశక్తి, చర్మ సమస్యలు వస్తాయి. అందుకే పాలు తాగిన తర్వాత ముల్లంగిని తినకూడదని హెచ్చరిస్తున్నారు.
- చేపలు : పాలు తాగే ముందు లేదా తర్వాత చేపలు తినకూడదు. చేపలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.. పాలు తాగిన తర్వాత చేపలు తింటే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.. అందుకే పాలు తాగిన తర్వాత చేపలు తినకూడదని పేర్కొంటున్నారు.
- సిట్రిక్ ఫ్రూట్స్: పాలు తాగిన వెంటనే సిట్రిక్ ఫ్రూట్స్ తినకూడదు. పాలు తాగిన వెంటనే సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల క్యాల్షియం.. పండ్లలో ఉండే ఎంజైమ్‌లను గ్రహిస్తుంది. దీని వల్ల మీ శరీరానికి పోషకాహారం కూడా అందదు. అందుకే పాలు తాగిన తర్వాత నారింజ, పైనాపిల్ వంటి పుల్లని పండ్లను తినకూడాదని పేర్కొంటున్నారు.
- పాలు తాగిన తర్వాత, తాగే ముందు కనీసం ఒక గంట గ్యాప్ ఉంచాలని.. ఎప్పుడూ కూడా వీటి కాంబినేషన్‌లో తినకూడదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..
ఇవి కూడా చదవండి
మరిన్ని హెల్త్ వార్తల కోసం..